దిశా చ‌ట్టంపై ఏపీ ప్రభుత్వం ప్ర‌త్యేక సాంగ్‌

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన దిశా ఘ‌ట‌న నేప‌థ్యంలో మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌ల‌ను తీసుకుంటున్న‌ది. మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం జిల్లాకు ఒక‌టి చొప్పున‌ దిశ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక దిశా పోలీస్ స్టేషన్‌ను కూడా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ శ‌నివారం రోజునే ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. అదేవిధంగా మహిళలకు ఎలాంటి భద్రత కల్పించాలనే అంశంపై పోలీసులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నట్లు వివరించారు. ఒక్కో దిశ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, 38 మంది కానిస్టేబుళ్లు గంటలూ మహిళల భద్రత కోసం విధుల‌ను నిర్వ‌ర్తించ‌నున్నారు. అదీగాక జిల్లాకో ప్ర‌త్యేకంగా దిశా న్యాయ‌స్థానాన్ని ఏర్పాటు చేయాల‌ని స‌ర్కారు భావిస్తున్న‌ది.

ఇదిలా ఉండ‌గా అత్యాచార కేసుల విచార‌ణ‌ను స‌త్వ‌రం పూర్తి చేసేందుకు ఏపీ స‌ర్కారు దిశా చ‌ట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్ర‌కారం అత్యాచార ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి 14 రోజుల్లో దర్యాప్తు, విచారణ పూర్తి చేసి… సరైన సాక్ష్యాధారాలు ఉంటే దోషులకు కేసు నమోదైనప్పటి నుంచీ 21 రోజుల్లో శిక్ష అమలు చెయ్యాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి జిల్లాలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేస్తారు. మహిళలు, చిన్నారులపై తీవ్రమైన నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష విధిస్తారు. అందుకే దీన్ని ప్రతిపక్షం కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంత‌రం ఈ బిల్లును పార్ల‌మెంట్‌కు పంప‌గా స‌వ‌ర‌ణ‌లు చేసి తిరిగి పంపాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం సూచించింది. ఆ ప‌నుల్లో నిమగ్న‌మ‌య్యారు అధికారులు.

ఇప్పుడు తాజాగా దిశ చట్టంపై జగన్ సర్కార్ ఓ ప్ర‌త్యేక గ్‌ను విడుదల చేసింది. దాదాపుగా 9 నిమిషాల విడివున్న‌ పాటలో దిశ చట్టంపై అవగాహన కల్పించారు. ఏదైనా ఆపద వస్తే ఆడవాళ్లు ఎలా స్పందించాలో? కూడా ఈ పాటలో వివరించారు. ‘మహిళ… ఓమహిళ అంటూ పాట మొదలవుతోంది’. ఆడవారిపై మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే 21 రోజుల్లో కఠిన శిక్షలు పడతాయన్న విషయాన్ని కూడా పాట రూపంలో వివరించారు. దిశ చట్టం కోసం ప్రముఖ
మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రుబెన్ ఈ పాట‌ను స్వ‌ర‌ప‌ర‌చ‌గా, ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.

Tags: anuprubens, ap cm jagan mohanreddy, dhisha special song, police stion