అడ‌వి మ‌నిషిగా రానా.. సోష‌ల్ మీడియాలో ఒక‌టే హ‌వా

బాహుబ‌లి త‌రువాత తెలుగు తెర‌పై క‌నిపించ‌కుండా పోయారు ద‌గ్గ‌బాటి రానా. ప్ర‌స్తుతం ఆయ‌న సినిమాలు వ‌రుస‌గా సెట్స్‌పైకి వెళ్తున్నాయి. విరాట‌ప‌ర్వం చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్‌ను జ‌రుపుకుంటున్న‌ది. ఇదిలా ఉండ‌గా ఒక్క‌సారిగా అనుకోకుండా మ‌ళ్లీ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు ఈ పొడ‌గ‌రి హీరో. వేస‌విలో సంద‌డి చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు.  రానాతో పాటు జోయా హుస్సేన్‌, శ్రియా పిల్లావుంకర్‌, పుల్‌కిత్‌ సామ్రాట్‌, విష్ణు విశాల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా అర‌ణ్య‌. ప్రభు సోలోమాన్ దీనికి దర్శకత్వం వహిస్తుండగా.. ఆస్కార్‌ విజేత రసూల్‌ సౌండ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తుండ‌డం విశేషం. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తికాగా.. పోస్డ్ ప్రొడక్షన్స్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మొత్తంగా ఏప్రిల్‌ 2న  హిందీలో ‘హాథీ మేరే సాథీ’, తెలుగులో ‘అరణ్య’గా, తమిళంలో ‘కాదన్‌’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. .

ఇదిలా ఉండ‌గా తాజాగా ఈ సినిమాకు సంబంధించి హాథీ మేరి సాథి హిందీ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మానవులు-జంతువుల మధ్య సంబంధాల్ని ప్రతిబింబించే వాస్తవ కథాంశాలతో తెరకెక్కుతున్న ఈ మూవీలో రానా అడవిలో ఉండే ఆదివాసి ‘బన్ దేవ్’ పాత్రలో కనిపించ‌నున్నాడు. తాజాగా అందుకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. అందులోతా రానా భారీగా పెరిగిన గెడ్డంతో ఒంటి నిండా గాయాలతో అడవి జంతువుల మధ్య ఉగ్ర రూపంతో అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాడు. బాహుబ‌లిలో బ‌ల్లాల దేవున్ని మ‌రిపిస్తున్నాడు. సినిమాపై అంచ‌నాలు ఒక్క‌సారిగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. పోస్ట‌ర్‌ను చూసిన రానా అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. మ‌రో హిట్టు ఖాతాలో ప‌డిన‌ట్లేన‌ని ఢంకా బ‌జాయిస్తున్నారు.

Tags: aranya, daggubati raana, haathi meri saathi, music rasool