నారాయ‌ణ కాలేజీ.. సోష‌ల్ మీడియాలో అదిరిపోయే కామెడీ..

విద్యాసంస్థల అధినేత నారాయ‌ణ టీడీపీ హ‌యాంలో ఒక వెలుగు వెలిగిపోయాడు. మంత్రిగా చ‌క్రం తిప్పాడు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నెల్లూరులో బ‌రిలో దిగి కోట్లు కుమ్మ‌రించినా ఫ్యాన్ తాకిడికి నిల‌బ‌డ‌లేక కొట్టుకుపోయాడు. దీంతో ఆర్థికంగా ఘోరంగా దెబ్బ‌తిన్న నారాయ‌ణ ప్ర‌స్తుతం ఆ న‌ష్టాన్ని భ‌ర్తీ చేసుకునే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. విద్యావేత్త‌గా ఉన్న ఆయ‌న ఇప్పుడు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారిగా మారారు. వెంచ‌ర్ల‌ను వేస్తూ అమ్ముకుంటున్నారు. ఇది వేరే విష‌యం. కానీ ఆయ‌న నారాయ‌ణ కాలేజీల‌పై అదిరిపోయే కామెడీ పోస్టు ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్న‌ది. నెటిజ‌న్ల‌ను క‌డుపుబ్బా న‌వ్వులు తెప్పిస్తున్న‌ది. హ‌స్యాన్ని పంచుతున్న‌ది. ఇంత‌కీ ఆ పోస్టు సారాంశం ఏమిటంటే..

ఇండియాలో ఉద్య‌గం చేసి చేసి విసుగొచ్చిన ఒకరు రిజైన్ చేస్తాడు. లండన్ లో అతిపెద్ద మాల్లో ఒక సేల్స్ మాన్ గా చేరిపోతాడు. ఉద్యోగంలో చేరిన మ‌రుస‌టి రోజు ఆ మాల్ య‌జ‌మాని వ‌చ్చి స‌ద‌రు ఉద్యోగిని ఈ రోజు ఎంత మందికి సేల్స్ చేశావు? అడగ్గా కేవ‌లం ఒక‌రికి మాత్ర‌మేన‌ని బ‌దులిస్తాడు. దీనికి ఆ యాజ‌మాని స‌రే ఒక్క‌టైతే ఒక్క‌టే గాని, అది ఎంత ఖ‌రీదుది అని ఆరా తీస్తాడు. దాని మ‌న ఉద్యోగి 8,009,770 పౌండ్స్ విలువైన సేల్స్ చేశాన‌ని చెప్ప‌డంతో యాజ‌మాని నోరెళ్ల‌బెడ‌తాడు. అంత పెద్ద సేల్ ఏమి చేశావు అంటూ ఉత్స‌క‌త‌తో అడ‌గ్గా.. వినండి. ఒక పెద్దాయనకి ఒక చేపలు పట్టే పెద్ద గేలం అమ్మాను అని వివ‌రిస్తాడు మ‌న ఉద్యోగి. దానికి కొంచెం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ గాలం ఖరీదు నువ్వు చెప్పినంత ఎక్కువ ఖరీదు కాదే అని అనుమానం వ్య‌క్తం చేస్తాడు బాస్. అంతే మీరు పూర్తిగా వినండి అంటూ మ‌ళ్లీ చెప్ప‌డం మొద‌లు పెట్టాడు మ‌న ఉద్యోగి

గాలానికి సరిపడే రాడ్, ఒక గేర్ అమ్మాను. ఎక్కడ చేపలు పట్టాలనుకుంటున్నారో అడిగితే దూరంగా నది ఒడ్డుననిని చెప్పాడు ఆ పెద్దాయ‌న‌. దీంతో గాలం కన్నా ఒక బోట్ లో వెళ్లి చేపలు పడితే బాగుంటుందని ఒప్పించి బోట్ స్టోర్లో ఒక షూనర్ బోట్ డబల్ ఇంజిన్ ఉన్నది కొనిపించాను. ఆ బోట్ ని త‌ర‌లించేందుకు వీలుగా ఆటొమోబైల్ డిపార్ట్మెంట్ లో ఒక కొత్త 4 * 4 డీలెక్స్ బ్లాజర్ కొనిపించాను. నది ఒడ్డునే ఉండడానికి కాంపింగ్ డిపార్ట్మెంట్ లో కొత్తగా ఒచ్చిన ఆరు స్లీపర్ల ఇగ్లూ కాంప్ టెంట్ దానిలో ఉండడానికి కావల్సిన భోజన సామగ్రి పాక్ చేయించాను.” అని ముగించాడు మ‌న ఉద్యోగి. అంతా విని ఆశ్య‌ర్యంలో మునిగిపోయాడు మాల్ బాస్‌. మ‌రింత ఉత్సాహంతో ఇవ‌న్నీ ఒక్క గాలం కొన‌డానికి వ‌చ్చిన వాడితో కొనిపించ‌వా అంటూ ప్ర‌శ్నించ‌గా, లేదు సార్ ఆ పెద్దాయ‌న నిజానికి త‌ల‌నొప్పి టాబ్లెట్ కోసం వ‌చ్చాడు. కానీ తలనొప్పిని చేపలు పట్టే హాబీ ద్వారా తగ్గించుకోవచ్చు అని ఒప్పించి అవ‌న్నీ కొనిపించారు. అంతే ఇక బాస్ ” అరే యార్ ! అంటూ ఇంతకీ నువ్వు ఇండియాలో ఏం ఉద్యోగం చేసేవాడివి అంటూ అడ‌గ్గా.. ఆ సేల్స్ మాన్ చెప్పాడు చైతన్య -నారాయణ, కార్పొరేట్ స్కూల్ లో టీచర్ ఉద్యోగం చేసేవాణ్ణి అంటూ బ‌దులిచ్చాడు. దీంతో ఏమీ అర్థంగాక‌,, టీచర్ కి, సేల్స్ కు,ఏంటి సంబంధం అంటూ అడ‌గ్గా.. బాస్ ఏబిసిడి లు నేర్పమని వస్తే , పదేళ్ల తర్వాత వచ్చే ఐఐటి -నీట్-సివిల్స్ , ర్యాంక్ పేరు మీద ఫీజులు వసూలు చేసేవాళ్ళం… అని మ‌న ఉద్యోగి బ‌దులివ‌డంతో ఆ యాజ‌మాని నోరెళ్ల‌బెడ‌తాడు. ఎవ‌రు రాశారు కానో ఇప్పుడీ పోస్టు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. నెటిజ‌న్లు దీనిని ఆస‌క్తిగా చ‌దువుతూ క‌డుపుబ్బా న‌వ్వుతున్నారు. మ‌రోవైపు విద్యావ్య‌వ‌స్థ ఏ స్థాయికి దిగజారిందో సృజ‌నాత్మ‌కంగా చెప్పిన పోస్టు రచ‌యిత‌కు మ‌న‌సులోనే ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Tags: educational institutions, iiit, neet, sales man, tdp ex minister narayana