” ఆవిడ ఓ మహా పతివ్రత..నన్ను సుఖపెడతా అంటూ ఆఫర్ ఇచ్చింది ” .. బన్నీ విలన్‌ని టార్చ‌ర్ పెట్టిన స్టార్ హీరోయిన్‌..!

క్యాస్టింగ్ కౌచ్ అంటే మామూలుగా హీరోయిన్లను, అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నటీమణులను కొత్తవారిని ఛాన్సులు పేరుతో వాడుకోవటం లేదా లైంగికంగా వేధించ‌డం. ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది భారతీయ సినిమా పరిశ్రమలో గత నాలుగు ఐదేళ్లుగా బాగా పాపులర్ అవుతూ వస్తోంది. క్యాస్టింగ్ కౌచ్ అంటే సాధారణంగా హీరోయిన్లు, నటీమణులు మహిళలు మాత్రమే వేధింపులకు గురవుతారని అనుకుంటాం. అయితే ఇండస్ట్రీలో మగవాళ్లు కూడా వేధింపులకు గురవుతున్న సందర్భాలు ఉన్నాయి.

కొంతమంది హీరోయిన్ లు కావచ్చు, నిర్మాతలుగా ఉన్న మహిళలు కావచ్చు అవకాశాలు ఇస్తామంటూ యంగ్ డైరెక్టర్లు, యంగ్ హీరోలను కూడా తమ కోరిక తీర్చాలని వేధింపులకు గురిచేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోగా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన రవి కిషన్ సింగ్ తాను కూడా ఒక స్టార్ హీరోయిన్ నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పటం ఇండియన్ సినిమా వర్గాలలో సంచలనగా మారింది.

తెలుగులో రేసుగుర్రం, కిక్ 2 సినిమాలలో విలన్‌గా నటించాడు రవి కిషన్ సింగ్. అత‌ను ఒకప్పుడు భోజపురి సినిమాలలో స్టార్ హీరోగా రాణించాడు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ నుంచి బిజెపి తరఫున లోక్‌స‌భకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక స్టార్ హీరోయిన్ రాత్రి మా ఇంటికి కాఫీకి వస్తారా ? అని ఆహ్వానించిందని చెప్పారు. కాఫీకి ఉదయం లేదా మధ్యాహ్నం ఆహ్వానిస్తారు రాత్రి ఆహ్వానించడం ఏంటని అనుమానం వచ్చింద‌ట.

ఆ తర్వాత ఆమె ప్రవర్తన అనుమానం రావడంతో రానని చెప్పినట్టు రవికిష‌న్ తెలిపారు. ఆమె ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా పెద్ద స్థాయిలో ఉందని.. ఆమె గురించి అందరికీ తెలుసు అని.. తాను ఆ స్టార్ హీరోయిన్ పేరు చెప్పనని చెప్పారు. ఏదేమైనా హీరోయిన్లు కూడా అప్పట్లో హీరోలు, కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన నటులను ఇలా వేధింపులకు గురి చేశారని రవి కిషన్ మాటలు చెబుతున్నాయి.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news