ఆత్మ‌సాక్షి స‌ర్వేలో టీడీపీ చింత‌మ‌నేని గెలుపు… మెజార్టీ లెక్క‌లు ఇవే…!

ఏపిలో వ‌చ్చే ఏడాది సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌లు సంస్థ‌లు స‌ర్వేలు చేస్తున్నాయి. అన్ని సంస్థ‌ల స‌ర్వేలోను ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త స్ప‌ష్టం గా క‌నిపిస్తుంది. ఈ క్ర‌మంలోనే వైసిపికి గ‌త ఎల‌క్ష‌న్స్‌లో కంచు కోట‌లుగా ఉన్న‌కొన్ని జిల్లాల‌తొ పాటు, కొన్ని నియోజ‌క వ‌ర్గాల‌లో ఈసారి ఆ పార్టీ గెల‌వ‌డం క‌ష్టం అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈక్ర‌మంలోనే గ‌త ఏడాది తెలుగుదేశం ఓడిపోయిన ఆ పార్టీ కంచుకోట‌ల‌లో ఈసారి సీన్ రివ‌ర్స్ అయేలా ఉంది. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో దెందులురు నియొజ‌క‌వ‌ర్గం టిడీపికి ముందు నుంచి కంచుకోట. పార్టి ఓడిపోయిన 2009 ఎన్నికల‌లోను ఇక్క‌డ నుంచి తెలుగుదేశం 14,000 ఓట్ల మెజారిటితో విజ‌యం సాధించింది.

Chintamaneni Prabhakar stopped and handed over to WG police - The Hindu

దెందులూరు నుంచి 2009, 2014 ఎన్నికల్లో వ‌రుస‌ విజయాలు సాధిస్తున్న చింతమనేని ప్రభాకర్ గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కొఠారు అబ్బ‌య్య చౌదరిపై 17,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దెందులూరు పార్టీ కంచుకోట‌, అందులోను రెండుసార్లు గెలిచిన స్ట్రాంగ్ ఎమ్ ఎల్ ఏ. ప్ర‌భుత్వ విఫ్‌గా ఉండి ప్ర‌భాకర్ అంత తేడాతో ఓడిపోవ‌డం పార్టీ వ‌ర్గాల‌కు సైతం మింగుడు ప‌డ‌లేదు. వైసిపి ప్ర‌భుత్వం వ‌చ్చాక చింత‌మ‌నేని ని బాగా టార్గెట్ చేశారు. చింత‌మ‌నేనిపై ప‌లు కేసులు పెట్టి జైలులో వేయ‌డం, చింత‌మ‌నేనిని బాగా టార్గెట్‌ చేయ‌డం జ‌రిగింది.

ప‌ది ఏళ్ళ చింత‌మ‌నేని పాల‌న‌లొ దెందులురు నియొజ‌క‌వ‌ర్గం చ‌రిత్రలోనే ఎప్పుడు జ‌ర‌గ‌నంత అభివృధి జ‌రిగింది. చింత‌మ‌నేని అభివృద్ది గురించి చిన్న మాట‌లో చేపుకోవాలంటే చిన్న మారుమూల, పల్లెటూర్లకు కూడా తారు రోడ్డు సౌకర్యం కల్పించారు. నియోజ‌క‌వ‌ర్గంలో డ్రైనేజ్‌, మంచినీటి విషయంలో ఆయ‌న చాలా కేర్ తీసుకున్నాడు. నియోజ‌క‌వ‌ర్గంలో కేవలం ఒకే ఒక్క రైతు కోసం రెండు లక్షల ఖర్చుపెట్టి చెరువుకు తూము వేయించ‌డం కూడా జ‌రిగింది. అత‌డు సాదార‌ణ రైతు కావ‌డం విశేషం. ఇవ‌న్నీ చింత‌మ‌నేని చేసిన ప‌నుల‌కు ఓ మ‌చ్చు తున‌క‌. నియోజ‌క వ‌ర్గంలో కోట్లాది రూపాయ‌ల అభివృద్ది చేయ‌డంలో అయ‌న‌కు అయ‌నేసాటిగా నిలిచారు.

గ‌త 40,50 సంవ‌త్స‌రాల చ‌రిత్రలో దెందులురు నియొజ‌క‌వ‌ర్గంలో ఎప్పుడూ చింత‌మ‌నేని పాల‌న‌లో జ‌రిగినంత అభివృద్ది జ‌ర‌గ‌లేదు. వైసీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొఠారు అబ్బాయ చౌదరి యువకుడు… రాజకీయంగా కుటుంబ అనుభవం తప్ప అబ్బాయ చౌదరికి వ్యక్తిగతంగా ఇమేజ్ అంటూ లేదు. కేవలం జగన్ వేవ్లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అబ్బాయి చౌదరి నాలుగేళ్ల పాలనలో దెందులూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యం.

ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున సంక్షేమ కార్య‌క్ర‌మాలు ఇత‌రేత‌ర చిన్న‌చిన్న ప‌నులు త‌ప్ప అబ్బ‌య చౌద‌రి ఎమ్ ఎల్ ఏ గా ఏమాత్రం త‌న ప్ర‌భావం చూపించ లేదు అన్న‌ది వాస్త‌వం. ఈక్ర‌మంలోనే వ‌చ్చే సాధార‌ణ ఏన్నిక‌ల‌లో మ‌రొసారి వీరిద్ద‌రు త‌లప‌డితే ఎవ‌రు ? గెలుస్తారు అన్నేదానిపై ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల స‌ర్వేల‌తో పాటు, ఎవ‌రి అంచ‌నాల‌లో వాళ్ళు మునిగి తేలుతున్నారు. విచిత్రం ఏంటంటే ఈసారి ప్ర‌తిస‌ర్వేలోను చింత‌మ‌నేని గెలుపు ప‌క్కా అని తేలిపోతోంది.

నియోజ‌కవ‌ర్గంలో అటు ఎమ్మెల్యే అబ్బ‌య చౌద‌రికి , ఇటు ప్ర‌భాక‌ర్ కు సొంత మండ‌లం అయిన పెద‌వేగిలో ఈసారి చింత‌మ‌నేనికి భారీ మేజారిటి రానుంది. అలాగే దెందులురు మండ‌లంలోని టీడిపి కంచుకోట‌లైన గ్రామాల్లో కూడా ఈసారి టీడిపికి బాగా ఓట్లు పోల్ కానున్నాయి. ఎటుతిరిగి ఏలూరు రూర‌ల్ మండ‌లంలోనే ప్ర‌భాక‌ర్ ప‌రిస్థితి కాస్త‌ సెట్ చేసుకొవాల్సి ఉంది. తాజాగా జ‌రిగిన ఆత్మ‌సాక్షి స‌ర్వేలో ప్ర‌భాక‌ర్ ఇప్ప‌టికే 12,000 ఓట్ల మేజారిటితో ఉన్న‌టు తేలింది.

ఇదే ప‌రిస్థితి వ‌చ్చే ఎన్నిక‌ల వ‌రకు కొన‌సాగితే చింత‌మ‌నేని మెజారిటి 20,000.. ఇంకా చెప్పాలంటే 25,000 దాటినా ఆశ్చ‌ర్య పోన‌వ‌స‌ర‌లేదు. ప్ర‌స్తుతం దెందులురు నియోజ‌కవ‌ర్గంలో గ్రౌండ్ వాతావ‌ర‌ణం కూడా అలానే సూచిస్తుంది. ఏదేమైనా చింత‌మ‌నేని ఈసారి భారీ మెజారిటీతో అసెంబ్లిలొ అడుగు పెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. అయితే ఆయన మెజార్టీ లెక్కలు మాత్రమే చూడాల్సి ఉంది.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media post, tdp, telugu news, trendy news