ఏపీలో 2024లో టీడీపీ స్వీప్ చేసే జిల్లా ఇదే… వైసీపీ అడ్ర‌స్ గ‌ల్లంతు ప‌క్కా…!

ఏపీ వచ్చే సాధారణ ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. ఓవైపు టిడిపి యువ నేత నారా లోకేష్ ఎన్నికల కోసమే యువగ‌ళం పేరుతో పాదయాత్రగా ప్రజల్లోకి వచ్చేసారు. మరోవైపు సీఎం జగన్ సైతం వచ్చే ఎన్నికలను టార్గెట్గా పెట్టుకుని ఇప్పటికే కార్యాచరణ అమలు చేస్తున్నారు. పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉండడంతో పాటు.. నియోజకవర్గాల వారీగా సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. పలు జిల్లాల్లో టిడిపి పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉన్న మాట వాస్తవం.

రాయలసీమతో పాటు నెల్లూరు లాంటి చోట్ల టిడిపి ఇంకా చాలా పుంజుకోవాలి. ఇంకా చెప్పాలంటే దాదాపు 30 – 40 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు కూడా లేని పరిస్థితి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా ఏపీలో ఒక జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్వీప్‌ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ జిల్లాలో విపక్ష వైసిపికి ఒక్కటంటే ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ జిల్లా ఏదో కాదు ఉమ్మడి గుంటూరు.. ప్రకాశం జిల్లాల నుంచి కొత్తగా ఏర్పడిన బాపట్ల.

బాపట్ల జిల్లా పరిధిలో గుంటూరు జిల్లాలోని రేపల్లె – బాపట్ల – వేమురుతో పాటు ప్రకాశం జిల్లాలోని పరుచూరు – అద్దంకి – చీరాల నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే బాపట్ల లోక్సభ పరిధిలో ఉన్న సంతనూతలపాడు నియోజకవర్గాన్ని ఒంగోలు జిల్లాలో కలిపినా లోక్‌స‌భ మాత్రం బాపట్ల కిందకే వస్తుంది. గత సాధారణ ఎన్నికల్లో ఏపీలో టిడిపి కేవలం 23 సీట్లకే పరిమితమైన కూడా… ఈ జిల్లాలో మాత్రం ఏకంగా నాలుగు అసెంబ్లీ సీట్లలో జెండా ఎగరేసింది.

పరిచూరు నుంచి ఏలూరు సాంబశివరావు – అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ – రేపల్లె నుంచి అనగాని సత్యప్రసాద్ – చీరాల నుంచి కరణం బలరాం విజయం సాధించారు. అనంతరం కరణం బలరాం వైసిపి గూటికి చేరిపోయారు. అయితే ఇప్పుడున్న సమీకరణల ప్రకారం బాపట్ల లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసిపి ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. పరుచూరు, అద్దంకి నియోజకవర్గాల్లో ఏలూరు సాంబశివరావు – గొట్టిపాటి రవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు.

రేపల్లెలో అనగానే సత్యప్రసాద్ కూడా అంతే బలంగా ఉన్నారు. ఇక బాపట్లలో నరేంద్ర వర్మ దూకుడుతో గత 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇక్కడ టిడిపి జెండా ఎగరనుంది. వేమూరులో సిట్టింగ్ మంత్రి మేరుగ నాగార్జున దెబ్బ‌తో మాజీ మంత్రి ఆనంద్‌బాబు పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌కుండానే గెలుస్తార‌ని అంటున్నారు. సంత‌నూత‌ల‌పాడులో గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఓ సారి స్వ‌ల్ప తేడాతో మ‌రోసారి వైసీపీ వేవ్‌లో ఓడినా నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌ద‌ల‌నందున ఈ సారి మాజీ ఎమ్మెల్యే విజ‌య్‌కుమార్‌కు తిరుగులేని వాతావ‌ర‌ణం ఉంది.

ఇక చీరాల‌లోనూ ఇప్పుడున్న ఇన్‌చార్జ్ లేదా ఎవ‌రికి సీటు ఇచ్చినా కూడా అక్క‌డ టీడీపీ సునాయాస‌నంగా విజ‌యం సాధించ‌నుంది. వైసీపీలోని అనైక్య‌త కూడా ఇక్క‌డ టీడీపీకి ప్ల‌స్ కానుంది. ముఖ్యంగా చీరాల‌, ప‌రుచూరు, అద్దంకి, సంత‌నూత‌ల‌పాడులో ఈ సారి జ‌గ‌న్ ఈక్వేష‌న్లు అన్నీ రివ‌ర్స్ కానున్నాయి. ఇక ఈ జిల్లా టీడీపీ అధ్య‌క్షులు, ప‌రుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు పార్టీ నాయ‌కుల‌ను, కేడ‌ర్‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటోన్న తీరు కూడా ఇక్క‌డ పార్టీకి ప్ల‌స్ కానుంది.

Tags: AP, ap leader, intresting news, latest news, latest viral news, politics, social media, social media post, telugu news, trendy news