కంచుకోట‌ వైసీపీకి చెక్…. బడా నేతని రెడీ చేసిన బాబు.!

ఈ సారి ఎన్నికల్లో గాని టీడీపీ గెలవకపోతే..నెక్స్ట్ ఆ పార్టీ భవిష్యత్ ప్రమాదంలో పడినట్లే..అందుకే ఈ సారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని చంద్రబాబు కష్టపడుతున్నారు. ఎక్కడ పట్టు విడవకుండా ముందుకెళుతున్నారు. వైసీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదురుకునేలా అభ్యర్ధులని రెడీ చేస్తున్నారు. ఈ సారి అభ్యర్ధుల విషయంలో బాబు కాంప్రమైజ్ అవ్వడం లేదు.

TDP chief N Chandrababu Naidu accuses NDA govt of using CBI, IT to harass  rivals, create fear - The Economic Times

బలం లేని నేతలని, సరిగ్గా పనిచేయని నేతలని పక్కన పెట్టేస్తున్నారు. ఎక్కడకక్కడ బలమైన అభ్యర్ధులని రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ సీట్లతో పాటు ఎంపీ సీట్లు కూడా ముఖ్యమే. కేంద్రంలో చక్రం తిప్పాలంటే ఎంపీ సీట్లలో కూడా సత్తా చాటాలి. అందుకే ఆ సీట్లలో కూడా బలమైన నాయకులని, ఆర్ధికంగా బలంగా ఉన్న నేతలని దింపేందుకు బాబు వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు సొంత జిల్లా..చిత్తూరు పార్లమెంట్ లో బలమైన అభ్యర్ధిని బాబు రెడీ చేస్తున్నారట.

అక్కడ ఎన్ శివప్రసాద్ చనిపోవడంతో టి‌డి‌పికి కొత్త నాయకుడుని వెతికే పనిలో పడ్డారు. ఇదే సమయంలో శివప్రసాద్ అల్లుడు నరసింహ ప్రసాద్..చిత్తూరు ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఎందుకంటే అక్కడ సులువు గా గెలవచ్చని అనుకుంటున్నారు. కుప్పంలో చంద్రబాబుకు వచ్చిన మెజారిటీతో చిత్తూరు ఎంపీ సీటుని దక్కించుకోవచ్చు. గత కొంతకాలంగా అదే విధంగా సీటు వస్తుంది.

Chittoor Railway Station Forum/Discussion - Railway Enquiry

అయితే నరసింహ రైల్వేకోడూరు ఇంచార్జ్ గా ఉన్నారు. దీంతో ఆయనకు చిత్తూరు సీటు ఇచ్చే అవకాశాలు లేవని తెలుస్తుంది. ఇక ఇక్కడ ఆర్ధికంగా బలంగా ఉన్న నేతని బాబు రెడీ చేస్తున్నారట. పార్లమెంట్ సీటులో మాత్రమే గెలవడం కాదు..పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఆర్ధికంగా ప్రభావితం చేయగల నేతని దించాలని బాబు చూస్తున్నారని తెలిసింది. త్వరలోనే చిత్తూరు పార్లమెంట్ లో బడా నేత ఎంట్రీ అవుతారని తెలుస్తోంది. చూడాలి మరి ఈ సారి చిత్తూరు ఎంపీ సీటు టి‌డి‌పి దక్కించుకుంటుందో లేదో.