ప‌వ‌న్ బాబు క‌లిస్తే మా దుకాణం బందే…. వైసీపీ టాప్ లీడ‌ర్ల టెన్ష‌న్ చూశారా…!

చంద్రబాబు-పవన్ కలిస్తే చాలు..మీడియా ముందుకొచ్చేసి..వారిని టార్గెట్ చేసి కొందరు వైసీపీ నేతలు తిడుతూ ఉంటారు. అసలు పవన్ రాక రాక ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే వైసీపీ నేతలు మీడియా ముందుకు రావడం మొదలుపెడతారు. ఇక పవన్ పొత్తు గురించి మాట్లాడితే చాలు..అదే పని గా విమర్శలు కురిపిస్తున్నారు. ఇక జగన్ కూడా అదే పనిలో ఉంటారు. ఎందుకంటే బాబు-పవన్ కలిస్తే వైసీపీకి భారీ నష్టం కాబట్టి..అందుకే అలా పొత్తు అంటే చాలు వారిని టార్గెట్ చేసేస్తారు.

ఇప్పుడు గత రెండు రోజుల నుంచి పవన్ పొత్తు గురించి మాట్లాడుతున్నారు. వైసీపీని గద్దె దించడానికి ఖచ్చితంగా పొత్తు ఉంటుందని, సి‌ఎం పదవి గురించి ఎన్నికల తర్వాత చూసుకుంటామని అంటున్నారు. ఇలా పొత్తుల గురించి పవన్ మాట్లాడటంతో..వరుసపెట్టి పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్..ఇంకా కొందరు నేతలు ప్రెస్ మీట్లు పెట్టి తిడుతూ ఉంటారు.

పైగా పవన్ కాపుల ఓట్లని బాబుకు తాకట్టు పెడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. అటు జగన్ సైతం..బాబు-పవన్ పొత్తుపై విమర్శలు చేస్తారు. ఇలా విమర్శలు చేయడం వెనుక వైసీపీ నేతలకు కాస్త భయం ఉందనే చెప్పాలి. ఎందుకంటే బాబు-పవన్ కలిస్తే ముందు ఎఫెక్ట్ ఆ తిట్టే వైసీపీ నేతలకే ఉంటుంది. టి‌డి‌పి-జనసేన కాంబినేషన్ ఉంటే వారికి ఓటమి తప్పదు అని చెప్పవచ్చు.

అందుకే వారు ఆ విధంగా పవన్‌ని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకు గత ఎన్నికల్లో పేర్ని నాని మచిలీపట్నంలో టి‌డి‌పిపై 6 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ అక్కడ జనసేనకు 18 వేల ఓట్లు పడ్డాయి. అంటే అప్పుడే టి‌డి‌పి-జనసేన కలిస్తే పేర్ని గెలిచే వారు కాదు. ఇక మిగిలిన వారి పరిస్తితి అంతే..అందుకే బాబు-పవన్‌ని టార్గెట్ చేస్తారు. మొత్తానికి ఈ సారి నోరు పారేసుకునే వైసీపీ నేతలకు చెక్ పడేలా ఉంది.