బాబు మాస్టర్ మైండ్.. ఆ జిల్లాల్లో వైసీపీ అప్ప‌డ‌ప్ప‌డ‌మే…!

గత ఎన్నికల్లో ప్రతి జిల్లాలో వైసీపీకి ఆధిక్యం వచ్చిన విషయం తెలిసిందే. 13 ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ వన్ సైడ్‌గా సీట్లు గెలిచింది. ఇక నాలుగు జిల్లాల్లో స్వీప్ చేసింది. విజయనగరం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో వైసీపీ స్వీప్ చేసింది. ఈ జిల్లాల్లో టి‌డి‌పికి ఒక్క సీటు రాలేదు. అయితే ఈ జిల్లాల్లో వైసీపీ మళ్ళీ సత్తా చాటుతుందా? అంటే ఈ సారి డౌటే అని చెప్పవచ్చు.

Under Chandrababu Naidu, A New Andhra Is In The Works

ఈ సారి జిల్లాల్లో వైసీపీని ఆధిక్యానికి టీడీపీ గండి కొట్టే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు ఎక్కడకక్కడ టి‌డి‌పి హవా పెరిగేలా రాజకీయం చేస్తూ వస్తున్నారు. అలాగే బలమైన అభ్యర్ధులని రెడీ చేస్తున్నారు. ఈ సారి పోటీ చేసే అభ్యర్ధుల విషయంలో బాబు రాజీ పడటం లేదు. సత్తా లేని నాయకులని పక్కన పెట్టి..బలమైన నాయకులని బరిలో దించేందుకు ప్లాన్ చేశారు. ఇప్పటికే కొన్ని స్థానాల్లో అభ్యర్ధులని దాదాపు ఫిక్స్ చేశారని చెప్పవచ్చు.

పైగా ఆయా జిల్లాల్లో వైసీపీపై ఉన్న వ్యతిరేకత టి‌డి‌పికి కలిసిరానుంది. అలా చూసుకుంటే స్వీప్ చేసిన నాలుగు జిల్లాల్లో వైసీపీ ఆధిక్యం తగ్గనుంది. ఇంకా చెప్పాలంటే టి‌డి‌పి ఆధిక్యంలోకి వచ్చేలా ఉంది. ఇప్పటికే విజయనగరంలో టి‌డి‌పికి లీడ్ కనబడుతుంది. అక్కడ 9 సీట్లు ఉంటే ఇప్పటికే 5 సీట్లలో టి‌డి‌పికి లీడ్ ఉంది. ఇంకా కష్టపడితే..రెండు సీట్లు అదనంగా వస్తాయి.

TDP to election officials: Remove fans from govt offices, it's YSRCP's  election symbol | Amaravati News - Times of India

ఇక వైసీపీ కంచుకోట లాంటి నెల్లూరులో కూడా టి‌డి‌పి ఆధిక్యం దిశగా వెళుతుంది..ఇక్కడ కూడా 5 సీట్లలో టి‌డి‌పి హవా ఉంది. అటు కర్నూలు జిల్లాలో 14 సీట్లు ఉంటే టి‌డి‌పికి 7, వైసీపీ 7 స్థానాల్లో పట్టు కనిపిస్తుంది. కడపలో 10 సీట్లు ఉంటే టి‌డి‌పికి 3, వైసీపీకి 7 స్థానాల్లో బలం ఉంది. ఏదేమైనా నాలుగు జిల్లాల్లో ఈ సారి వైసీపీకి భారీ దెబ్బ ఖాయమే.