ల‌క్ష్మీప్ర‌ణ‌తి త‌న లైఫ్‌లోకి వ‌చ్చాక తార‌క్‌లో వ‌చ్చిన బిగ్‌ఛేంజ్ ఇదే… కెరీర్‌కు అదే పెద్ద ప్ల‌స్ అయ్యిందిగా..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ప్రస్తుతం కెరీర్ లోనే తిరుగులేని ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. టెంపర్ సినిమా నుంచి ఎన్టీఆర్‌కు పట్టిందల్లా బంగారం అవుతుంది. వరుసగా టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ – జై లవకుశ – అరవింద సమేత – త్రిబుల్ ఆర్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. టాలీవుడ్ లో ఈ తరం జనరేషన్ హీరోలలో ఏ హీరోకు కూడా వరుసగా ఆరు సూపర్ డూపర్ హిట్ సినిమాలు లేవు.

Junior NTR And Lakshmi Pranathi's 100 Crore Wedding: When The Star Wife  Wore A Saree Worth 1 Crore

ఎన్టీఆర్ సినిమాల సంగతి పక్కన పెడితే ఫ్యామిలీతోనూ ఎక్కువ టైం గడుపుతూ ఉంటాడు. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లి ఎంజాయ్ చేసి వస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ ప్రణతి 2011లో వచ్చారు. ఆమె వచ్చాక ఎన్టీఆర్ లో చాలా పరిమితి కనిపించింది. సినిమాల విషయమే కాదు.. మాట్లాడే తీరులోను ఎన్టీఆర్ అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చేస్తున్నాడు.

అంతకు ముందు వరకు ఎన్టీఆర్ మాటలో అప్పుడప్పుడు తడబాటు ఉండేది. కాస్త ఆవేశం కనిపించేది. ముఖం అంతా రౌద్రంగా ఉన్నట్టు అనిపించేది. ఎప్పుడు అయితే లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిందో.. అప్పటినుంచి ఎన్టీఆర్ లో చాలా కూల్ నేచర్ కనిపిస్తోంది. మాటల్లో అద్భుతమైన పరిణితి వచ్చింది. అందుకే బిగ్‌బాస్‌, మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోలు చేస్తే సూప‌ర్ హిట్ అయ్యాయి.

Romance Tales: Jr NTR, Lakshmi Pranathi are a perfect example of first love  & match made in heaven | PINKVILLA

ముఖ్యంగా తన అమ్మతో పాటు కుటుంబానికి టైం కేటాయించే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే అలవాటు కూడా ఎన్టీఆర్‌కు ఎక్కువ అయింది. ఇక సినిమాల పరంగా కథలు ఎంచుకునే తీరులోనూ చాలా మార్పు వ‌చ్చింది. కేవలం మాస్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధానంలోనూ.. క్లాస్ లుక్ రావటంలోనూ ఎన్టీఆర్‌లో సరికొత్త మార్పు వచ్చింది. ఇదంతా లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చాక వచ్చిన పెద్ద మార్పే అని.. ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ జనాలు తరచూ చర్చించుకుంటూ ఉంటారు.