కేవ‌లం ఎన్టీఆర్ అంటే ఇష్టంతో కాజ‌ల్ అగ‌ర్వాల్ అంత పెద్ద రిస్క్ చేసిందా…!

ఎలాంటి గొప్ప స్టార్ హీరోయిన్ అయినా తాము నటించిన హీరోలలో కొంతమంది హీరోలపై ప్రత్యేకమైన అభిమానం చూపిస్తూ ఉంటారు. హీరోల గురించి చెప్పేటప్పుడు అందరు హీరోలు గ్రేట్ అని.. అందరూ మంచివారే అని చెప్పినా కొందరు హీరోలలో ఉండే ప్రత్యేకమైన లక్షణాలు హీరోయిన్లను బాగా ఆకర్షిస్తూ ఉంటాయి. అందుకే ఆ హీరోలపై చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టపడే హీరోయిన్లు చాలామంది ఉంటారు.

Jr NTR and Kajal Aggarwal in Pakka Local Song from Janatha Garage -  Photos,Images,Gallery - 48667

ఎంతో ? మంది హీరోయిన్లు ఎన్టీఆర్ పై ఎన్నో రకాల ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా కాజల్ అగర్వాల్ కూడా ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టపడుతుంది. వీరిద్దరి కాంబినేషన్లో బృందావనం – బాద్ షా – టెంపర్ సినిమాలు వచ్చాయి ఈ మూడు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక ఎన్టీఆర్ హీరోగా వచ్చిన మరో బ్లాక్ బస్టర్ సినిమా జనతా గ్యారేజ్.

Kajal Aggarwal gives HUGE SHOCK to Janatha Garage team

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా సమంత, నిత్యా మీనన్ నటించారు. అయితే స్పెషల్ సాంగ్‌లో కాజల్ ఎన్టీఆర్ తో కలిసి స్టెప్పులు వేసింది. అప్పటికి కాజల్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ ఆఫర్ రాగానే స్టార్ హీరోయిన్‌గా ఆ ప్లేస్‌లో ఉన్న వేరే హీరోయిన్ ఎవరైనా రిజెక్ట్ చేస్తారు. అయితే ఎన్టీఆర్ పై ఉన్న స్పెషల్ అభిమానంతో కాజల్ ఈ ఐటెం సాంగ్ లో నటించేందుకు వెంటనే ఓకే చెప్పేశారు అట.

Kajal Support Inevitable for NTR again? | cinejosh.com

పక్కా లోకల్ సాంగ్‌లో ఎన్టీఆర్ కి జోడిగా కాజల్ వేసిన స్టెప్పులు ఎంత రచ్చ చేశాయో… ఈ సాంగ్ ఆ సినిమాకు ఎంత హైలైట్ అయిందో తెలిసిందే. స్టార్ హీరోయిన్గా ఉన్న కాజల్ కేవలం ఓ ఐటెం సాంగ్ లో నటించింది అంటే నిజంగా ఆమె కెరీర్‌ను పెద్ద రిస్క్ లో పెట్టుకున్నట్టే అని చెప్పాలి. ఇదంతా కేవలం ఎన్టీఆర్ పట్ల ఆమెకు ఉన్న ఇష్టంతోనే చేసిందన్న చర్చలు అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించాయి.