మ‌హేష్‌, ప‌వ‌న్‌ను అప్పుడే బీట్ చేసిన ఎన్టీఆర్ ‘ దేవ‌ర‌ ‘ ..!

టాలీవుడ్లో ఈ ఏడాది వరుసగా క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరికొన్ని క్రేజీ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఆదిపురుష్‌తో మొదలుకొని వచ్చే ఏడాది సమ్మర్ వరకు వరుసగా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో ముగ్గురు క్రేజీ హీరోలు ఎన్టీఆర్ – పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు ముగ్గురు నటిస్తున్న సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాలో అయితే ఏకంగా మూడు నాలుగు షూటింగ్‌లు ఉన్న సంగతి తెలిసిందే.

Pawan Kalyan – Sai Dharam Tej's film is titled BRO; First look motion  poster looks resplendent | 123telugu.com

పవన్ నటిస్తున్న సినిమాలలో ముందుగా మేనల్లుడు సాయి తేజ్‌తో కలిసి నటిస్తున్న బ్రో సినిమా జులై 28న థియేటర్లలోకి రానుంది. ఇక మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. ఈ సినిమాకు రెండు మూడు టైటిల్స్ పరిశీలిస్తున్న చివరగా గుంటూరు కారం టైటిల్ ఫైనల్ చేసే దిశగా త్రివిక్రమ్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో తెర‌కెక్కుతున్న సినిమాకు ముందు నుంచి ఊహించినట్టుగానే దేవర అనే టైటిల్ ఈరోజు ఫైనల్ చేస్తూ వీడియో వదిలారు. ఇక ఈ ముగ్గురు స్టార్ హీరోలు నటిస్తున్న తాజా సినిమాలలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాల టైటిల్స్ కంటే ఎన్టీఆర్ సినిమా టైటిల్ చాలా పవర్ ఫుల్ గా ఉండడంతో పాటు అదిరిపోయింద‌న్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది.

NTR 30 is officially titled Devara; NTR looks marvelous in the first look  poster New | 123telugu.com

ముగ్గురు హీరోల అభిమానుల సంగతి పక్కన పెట్టేస్తే సాధారణ సినీ జనాలు, న్యూట్రల్ సినీ అభిమానులు మాత్రం ఎన్టీఆర్ సినిమా టైటిల్ కే ఓటు వేస్తున్నారు. కచ్చితంగా మహేష్, పవన్ సినిమాల‌ కంటే ఎన్టీఆర్ సినిమా ఎక్కువ సంచలనాలు క్రియేట్ చేసేందుకు అవకాశం ఉందన్న చర్చలు అప్పుడే ప్రారంభం అయ్యాయి. పైగా ఎన్టీఆర్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుండటం మరో విశేషం.