Pawan Kalyan : అన్నయ్యకి హ్యాండ్ ఇచ్చిన తమ్ముడు..!

Tammudu Pawan Kalyan Big Hand to Annayya Chiranjeevi

Pawan Kalyan : మెగా ఈవెంట్ అంటే అన్నయ్య చిరంజీవి గెస్ట్ గా రావడం కామన్ అయ్యింది. అయితే ఒక్కోసారి ఆయన లేకుండానే మెగా హీరోల ఈవెంట్ లు అవుతుంటాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి ఈవెంట్ అంటే ఆయన రేంజ్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అది కూడా మెగా హీరోనే రావాలి అతనెవరు అంటే.. ఇంకెవరు పవర్ స్టార్ పవన్ కళ్యాణే అని చెప్పొచ్చు. అందుకే అన్నయ్య సినిమా ఈవెంట్ కి తమ్ముడు.. తమ్ముడి సినిమా ఈవెంట్ కి అన్నయ్య వస్తుంటారు.

అలానే చిరు చేస్తున్న గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం అందింది. జనసేన కార్యక్రమాల్లో ఉన్న పవన్ తన సినిమాల షూటింగ్స్ కే టైం కేటాయించలేకపోతున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన అమెరికాలో ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం లో ఉన్నాడు. అందుకే అన్నయ్య ఈవెంట్ కి రావడం కష్టమని చెప్పేశాడట.

సడెన్ గా తమ్ముడు ఇలా హ్యాండ్ ఇస్తాడని అన్నయ్య చిరంజీవి కూడా ఊహించలేదని తెలుస్తుంది. అయితే తమ్ముడు వచ్చినా రాకపోయినా మరో హీరోని గెస్ట్ గా పిలవాలని ఫిక్స్ అయ్యారట. మరి మెగా ఈవెంట్ కి గెస్ట్ ఎవరవుతారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే అని చెప్పొచ్చు. మళయాళ సినిమా లూసిఫర్ కి అధికారిక రీమేక్ గా గాడ్ ఫాదర్ సినిమా వస్తుంది. ఈ సినిమాని తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేశారు.

Tags: Annayya, chiranjeevi, godfather, Pawan kalyan, Salman Khan, Tammudu