Shakunthalam : స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తెలుగులో శాకుంతలం, యశోద సినిమాలు చేస్తుంది. మైథలాజికల్ మూవీగా వస్తున్న శాకుంతలం సినిమాలో సమంత నటన అదిరిపోతుందట. గుణశేఖర్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని నీలిమ గుణ, దిల్ రాజు కలిసి నిర్మించారు. అయితే ఇటీవల సినిమా చూసిన దిల్ రాజు సమంత నటన చూసి ఫిదా అయ్యారట. సినిమా చూశాక ప్రాజెక్ట్ మీద మరింత కాన్ ఫిడెన్స్ వచ్చిందట.
అందుకే శాకుంతలం సినిమాని తెలుగుతో పాటుగా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ లో గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సమంత గ్లామర్ సైడ్ కూడా చాలా అద్భుతంగా చూపించాడట గుణశేఖర్. తప్పకుండా సమంతకి ఈ సినిమాతో మంచి పేరు వస్తుందని అంటున్నారు.
సినిమా చూసిన కొంతమంది పరిశ్రమ వ్యక్తులు కూడా సినిమా పర్ఫెక్ట్ గా వచ్చిందని చెప్పారట. ఈ సినిమా మరోసారి తెలుగు సినిమా స్థాయిని నేషనల్ వైడ్ గా సత్తా చాటుతుందని అంటున్నారు. సమంత, దేవ్ మోహన్ ల రొమాన్స్ బాగుంటుందట. సినిమాకు మణిశర్మ మ్యూజిక్ మరో హైలెట్ అని అంటున్నారు.