Payal Rajput : ఆరెక్స్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కి ఏమైంది.. ఔచ్ ఐ గాట్ హర్ట్ అంటూ ఇన్ స్టాగ్రాం లో కామెంట్ పెట్టింది. పాయల్ ఫోటో చూస్తే ఆమె గ్లామర్ సైడ్ మాత్రమే చూస్తాం.. ఆమె షేర్ చేసిన ఫోటోలో కూడా ఆమె నవ్వుతూ ఉంటే ఆమె వైపే చూశారు. కానీ ఆ కామెంట్ ఏంటి అలా పెట్టింది అనుకున్నారు. కానీ అక్కడ అసలు విషయం ఏంటంటే అమ్మడి కాలికి ఏదో దెబ్బ తగిలింది. అది కరెక్ట్ గా చూపించలేదు. కానీ క్లియర్ గా అబ్సర్వ్ చేస్తే అర్ధమవుతుంది.
మరి షూటింగ్ లో గాయమైందో లేక ఇంట్లో ఏదైనా చేస్తుంటే దెబ్బ తగిలిందో కానీ పాయల్ మోకాలికి ఏదో జరిగింది. అది తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. ప్రస్తుతం మంచు విష్ణు జిన్నా సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది పాయల్ రాజ్ పుత్. ఆరెక్స్ 100 లాంటి సినిమా తో సూపర్ హిట్ అందుకున్న పాయల్ ఆ సినిమా తర్వాత అన్నీ అలాంటి పాత్రలే రావడంతో కొన్ని సినిమాలు వదులుకుంది.
అయితే కెరియర్ మరీ స్లో అవడంతో ఇక ఇప్పుడు మళ్లీ ఆరెక్స్ లాంటి సబ్జెక్ట్ లు వచ్చినా సరే ఓకే అనేస్తుందట. జిన్నా సినిమాలో మంచు విష్ణు పాయల్ ని బాగానే వాడుకున్నారని అర్ధమవుతుంది. ఆమె గ్లామర్ నే సినిమాలో హైలెట్ అయ్యేలా చేశారట. జిన్నా సినిమాలో పాయల్ తో పాటుగా సన్నీ లియోన్ కూడా నటించింది. కాబట్టి ఇద్దరు హాట్ భామల మధ్య మంచు విష్ణు హిట్ కొట్టేలానే ఉన్నాడు.
View this post on Instagram