ఇటీవల చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటించగా ఈ సినిమా ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి నెగటివ్ టాక్ రావడంతో చిరంజీవి – మెహర్ రమేష్ లపై పలు కామెంట్స్ వెలువడ్డాయి. ఈ సినిమాతో చిరు ఫ్యాన్స్ కూడా సంతృప్తి చెందలేకపోయారు. ఇటీవల ప్రముఖ ప్రొడ్యూసర్ తమ్మిరెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ చిరు రీమేక్‌లపై కౌంటర్స్ వేశాడు.
అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో వచ్చిన వాళ్లంతా పని పైన ధ్యాస ఉంచే వారిని ఇప్పటికే అలాంటి వాళ్ళు ఉన్నారు కానీ చాలామంది వరకు సినిమాలు వ్యాపారంగానే చూస్తున్నారు అని చెప్పాడు. కధ చెప్పే డైరెక్టర్స్ కూడా ఎలివేషన్ ఇస్తూ కథను హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సుత్తి లేకుండా అసలైన కథను చెప్పేవారు చాలా తగ్గిపోయారు. ప్రేక్షకులకు పనికి వచ్చే కంటెంట్ అది కూడా నేచురల్ గా ఉంటే సినిమాలు ఆడతాయి. అది పక్కనపెట్టి ఏదో చేస్తే సినిమాలు ఆడవు.
ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, చిరంజీవి లాంటి హీరోలంతా తమ కెరీర్ మొదట్లో మెదడు యాక్టింగ్ చేసినట్లు ఉంటాయి. చిరు కూడా తన కెరీర్ స్టార్టింగ్‌లో శుభలేఖ, స్వయంకృషి, రుద్రవీణ, విజేత లాంటి ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలకు రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. అమీర్ దంగల్ సినిమా లాంటి సినిమాలు చిరంజీవి రీమేక్ గా తీసిన జనాలు చూస్తారు. కానీ భోళా శంకర్, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు చేసి డిసప్పాయింట్ చేయడం కరెక్ట్ కాదని నేచురల్ గా మూవీస్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుందని నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ విషయాన్ని చిరంజీవితో చెబుదామని ప్రయత్నించాను కానీ కుదరలేదు. ఒకప్పుడు చిరంజీవి సినిమాలు చూస్తే మన ఇంట్లో వాడిలా కనిపించేవాడు కానీ ఇప్పుడు తీస్తున్న చిరంజీవి సినిమాల్లో అటువంటి ఫీల్ లేదు మళ్ళీ అలాంటి సినిమాలు తీసే చిరంజీవిని చూడాలని ఉంది. ఆ సినిమాలు బాగా ఆడతాయని నమ్మకం కూడా నాకు ఉంది అంటూ తమ్మిరెడ్డి భరద్వాజ్ చెప్పుకొచ్చాడు. ఇదే అభిప్రాయాన్ని చాలామంది మెగా ఫాన్స్ కూడా వ్యక్తం చేశారు. ఇక చిరు తర్వాత నటించబోయే సినిమా కథలోనైనా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.