టీడీపీ అధినేత చంద్రబాబు.. లేటుగా వచ్చినా.. అదరగొడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల కు సంబంధించి.. ఈ ఏడాది తొలి నాలుగు మాసాల వరకు కూడా ఒక సందిగ్ధ పరిస్థితిని అందరూ ఎదు ర్కొన్నారు. ముఖ్యంగా చంద్రబాబు అయితే.. ఏం చేయాలి? ఎలా ముందుకు సాగాలి? అనే విషయంలో తర్జన భర్జన పడ్డారనే చెప్పాలి. అయితే.. మహానాడు వచ్చే సరికి.. మినీ మేనిఫెస్టో ప్రకటించడం ద్వారా.. తన ఆధిపత్య ధోరణిని ప్రదర్శించారు.
అంటే.. రేపు ఎన్నికలకు సంబంధించి నిన్న మొన్నటి వరకు పొత్తులు ఉంటాయని అంచనా వేసుకు న్నా.. ఇవి ఉండకపోవచ్చనే సంకేతాలు వచ్చిన నేపథ్యంలో.. ఉన్నా లేకున్నా.. విజయం దక్కించుకు నేందుకు తమ వంతుగా కృషి చేయకతప్పదని నిర్ణయించారు. ఈ క్రమంలో తమ ఆదిపత్యాన్ని నిరూపిం చుకునేలా మినీ మేనిఫెస్టోను కూడా ప్రకటించారు. సో.. దీనిని బట్టి పొత్తులు లేకున్నా.. గెలుపు గుర్రం ఎక్కుతామనే ధీమాతోనే చంద్రబాబు ఉన్నారు.
ఇక, ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు మరింతగా పోరును తీవ్రతరం చేస్తున్నా రు. లేటుగానే ఆయన ఒంటరిపోరుకు రెడీ అన్న సంకేతాలు ఇచ్చినా.. ఈ సంకేతాలను బలంగానే పంపించడం.. వైసీపీపై పోరును తీవ్రం చేస్తుండడం.. ప్రజలను కలుసుకోవడం.. వంటివి టీడీపీ రేంజ్‌ను పెంచుతున్నాయని ఆ పార్టీలోని సీనియర్లు చెబుతున్న మాట. ఇది పార్టీ అంతర్ముఖ కోణంలో చూస్తే.. పుంజుకునేందుకు భారీ అవకాశం కనిపిస్తోంది.
ఇక, బహిర్ముఖ కోణంలో చూసినా.. టీడీపీకి ఇప్పుడు ఉన్న ఏకైక బలం చంద్రబాబు విజన్. అదేవిధంగా సొంత మేనిఫెస్టో.. ఈ రెండు కూడా టీడీపీకి ఎస్సర్టులుగా మారుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితిలో ఒంటరి పోరుకు సిద్ధపడాల్సి వచ్చినా.. తిరుగులేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో లేటుగానే ప్రారంభించినా.. చంద్రబాబు ప్రచారంలో దూకుడుగా.. దూసుకుపోతున్నారని చెబుతున్నారు సీనియర్లు.