నందమూరి నటసింహ బాలకృష్ణ అన్‌స్టాఫబుల్ టాక్ షో తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మెప్పించారు. అన్‌స్టాపబుల్ టాక్ షో తర్వాత బాలయ్య క్రీజ్ ఎలా ? పెరిగిందో చూశాం. ఈ టాక్ షో ఆరంభంలోనే కొన్ని విమర్శలు వచ్చాయి. హోస్ట్‌గా బాలయ్య సక్సెస్ కాలేడని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే అందరి అంచనాలు పటాపంచలు చేస్తూ ఈ టాక్ షోను బాలయ్య బిగ్గెస్ట్ సక్సెస్ చేశారు. అసలు తెలుగు బుల్లితెరపై ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా బాలయ్య హోస్ట్‌గా విశ్వరూపం చూపించారు.
తెలుగులోనే టాప్ రేటెడ్ టాక్ షోలలో ఒకటిగా అన్‌స్టాపబుల్ నిలిచింది. సీజన్ 1తో పాటు సీజన్ 2లో కూడా బాలయ్య హోస్ట్‌గా తనదైన శైలి పంచ్‌లు, ప్రాసలు, కామెడీ టైమింగ్‌తో బాలకృష్ణ ఆకట్టుకున్నాడనే చెప్పాలి. సెలబ్రిటీలను బాలయ్య ప్రశ్నలు అడిగిన తీరుపై ప్రశంసల జల్లులు కురిశాయి.
ఈ క్రమంలోనే బాలయ్య ఈ టాక్ షోను సూపర్ సక్సెస్ చేయడంతో ఇప్పుడు మరో కొత్త టాక్‌షో నిర్వాహకులు ప్లాన్ చేశారట. అన్‌స్టాపబుల్ రన్ చేసిన అల్లు అరవింద్‌కు చెందిన ఆహా ఓటీటీ సంస్థ బాలకృష్ణ కొత్త షోను ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు సమాచారం. బాలయ్య ప్రస్తుతం నటిస్తోన్న భగవంత్ కేసరి తర్వాత ఈ ఓటీటీ షో కోసం బాలకృష్ణ డేట్లు కేటాయించాడని తెలుస్తోంది.
ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భగవంత్ కేసరి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలోకి వస్తోంది. బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది.