Khushbu : ఖుష్బుని కమిట్మెంట్ అడిగిన టాప్ హీరో.. ఆమె ఆన్సర్ కి మైండ్ బ్లాక్..!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ ఖుష్బు అంటే తెలుగు ఆడియెన్స్ కి కూడా మంచి సుపరిచితురాలే. విక్టరీ వెంకటేష్ మొదటి సినిమా కలియుగ పాండవులు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఖుష్బు (Khushbu) తెలుగులో కన్నా తమిళంలో ఎక్కువ సినిమాలు చేసి స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. తమిళనాడులో ఖుష్బు కోసం గుడి కూడా కట్టిన ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి ఖుష్బుకి కూడా కాస్టింగ్ కౌచ్ ఇన్సిడెంట్స్ తప్పలేదని తెలుస్తుంది.

ముఖ్యంగా ఆమె రీసెంట్ గా ఇచ్చిన ఇంటెర్వ్యూలో ఓ స్టార్ హీరో తనని కమిట్మెంట్ అడిగాడని చెప్పి షాక్ ఇచ్చింది. అయితే దానికి సమాధానంగా ఆమె ముందు నీ కూతురిని మా తమ్ముడితో పంపించి అప్పుడు నేను నీతో వస్తానని అన్నదట. దానితో ఆ స్టార్ హీరో మైండ్ బ్లాక్ అయ్యిందని.. అప్పటినుంచి తనని ఎవరు అలాంటి దాని గురించి అడిగే సాహసం చేయలేదని చెప్పుకొచ్చింది ఖుష్బు.

ఇంతకీ ఖుష్బుని కమిట్మెంట్ అడిగిన ఆ స్టార్ ఎవరా అని ఆరా తీస్తున్నారు. అయితే ఖుష్బు (Khushbu) తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఆమెకి తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆమె జబర్దస్త్ షోలో పార్ట్ టైం జడ్జ్ గా వస్తున్నారు.

 

Tags: Jabardasth, Kaliyuga Pandavulu, Khushbu, Khushbu Sunder, Kollywood, Star Heroine, Tollywood, Venkatesh