Tamanna : లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా.. బాబోయ్ మిల్కీ బ్యూటీ బెడ్ సీన్స్ లో అంటే..!

నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన లస్ట్ స్టోరీస్ వెబ్ సీరీస్ సూపర్ హిట్ అయ్యింది. ఆ సీరీస్ తోనే బాలీవుడ్ లో కియరా అద్వాని సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అడల్ట్ కంటెంట్ తో వచ్చిన లస్ట్ స్టోరీస్ ని తెలుగులో కూడా పిట్ట కథలు అని తీశారు. లస్ట్ స్టోరీస్ ద్వారా కియరా అద్వాని, రాధికా ఆప్టే ఆడియెన్స్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ 2 సిద్ధం చేస్తుంది.

ఈ వెబ్ సీరీస్ ని సుజోయ్ ఘోష్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక లస్ట్ స్టోరీస్ 2 లో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుందని తెలుస్తుంది. రెండు దశాబ్ధాలుగా సౌత్ ఆడియెన్స్ ని అలరిస్తున్న తమన్నా (Tamanna) ఈమధ్య బాలీవుడ్ లో కూడా బిజీ అయ్యింది. ఇక బాలీవుడ్ ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యేలా ఆమె లస్ట్ స్టోరీస్ 2 కి సైన్ చేసిందట. లస్ట్ స్టోరీస్ అంటేనే బోల్డ్ కంటెంట్ మరి ఈ సీరీస్ లో తమన్నా ఏ రేంజ్ లో రెచిపోతుందో చూడాలి.

ఇన్నాళ్లు సినిమాలు చేసినా సరే గ్లామర్ షో విషయంలో లిమిట్స్ లో ఉన్న తమన్నా లస్ట్ స్టోరీస్ కోసం మాత్రం ఇంటిమేట్ సీన్స్ లో నటిస్తుందని తెలుస్తుంది. ఈ సీరీస్ కోసం తమన్నా (Tamanna) భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది.

Tags: Bollywood, Lust Stories, netflix, Tamanna, Tamanna Bhatia, Tamanna Lust Stories