NBK107.. ఐటం సాంగ్ భూం బద్ధలే అట..!

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమా (NBK107)కు జై బాలయ్య టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో శృటి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అఖండ హిట్ తో బాలయ్య, క్రాక్ హిట్ తో గోపీచంద్ మలినేని ఇద్దరు సూపర్ ఫాం లో ఉన్నారు. ఈ కాంబినేషన్ లో సినిమా బాక్సాఫీస్ బద్ధలు కొట్టేయడం ఖాయమని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ గురించి హింట్ ఇచ్చి అంచనాలు పెంచారు ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి. బాలయ్య 107 (NBK107)వ సినిమాలో స్పెషల్ సాంగ్ గురించి ఆయన చెబుతూ సినిమాలో సాంగ్ భూ బద్ధల్ స్టఫ్ అని కామెంట్ పెట్టాడు. అంటే క్రాక్ సినిమాలో గోపీచంద్ భూ బద్ధల్ స్పెషల్ సాంగ్ అదిరిపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో అంతకుమించిన ఐటం సాంగ్ ఉండబోతుందని తెలుస్తుంది. ఈ స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ నటిస్తుందని తెలుస్తుంది.

ఇక బాలయ్య 107వ సినిమా డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అఖండ సెంటిమెంట్ తో రిలీజ్ టైం కూడా డిసెంబర్ లో పెట్టుకున్నట్టు తెలుస్తుంది. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారని తెలిసిందే.

Tags: balakrishna, Gopichand Malineni, NBK, NBK 107, Shruthi Hassan, Tollywood