మిల్కీ బ్యూటీ తమన్నా (Tamanna) టాలీవుడ్ కెరియర్ మొదలు పెట్టి 20 ఏళ్లు అవుతునా ఇప్పటికీ అమ్మడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈమధ్యనే ఎఫ్3 తో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది తమన్నా. తెలుగుతో పాటుగా తమిళ హిందీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న తమన్నా అక్కడ ఇక్కడ అదరగొడుతుంది. ఇక లేటెస్ట్ గా ముంబై వీధుల్లో కనిపించే సరికి కెమెరా క్లిక్ అనిపించారు. టీ షర్ట్ ధరించి క్యాజువల్ ప్యాంట్ ధరించిన తమన్నా కన్నా ఆమె చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ మీద అందరి దృష్టి పడింది.
సెలబ్రిటీస్ వాడుతున్న వాటి గురించి ఆడియెన్స్ లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. హీరోల గురించి అయితే వారు వేసుకున్న టీ షర్ట్, వాచ్ ల గురించి తెలుసుకుంటారు. ఇక హీరోయిన్స్ అయితే వారి హ్యాండ్ బ్యాగ్ గురించి ఆరా తీస్తారు. తమన్నా (Tamanna) హ్యాండ్ బ్యాగ్ క్లో టోట్ బ్రాండ్ కి సంబందించినది దీని ధర దాదాపు 88000 దాకా ఉంటుందని తెలుస్తుంది. తమన్నా వాడుతున్న హ్యాండ్ బ్యాగ్ ధర తెలుసుకుని ఆడియెన్స్ షాక్ అవుతున్నారు.
ఇక తమన్నా చేస్తున్న సినిమాల గురించి చూస్తే తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమా చేస్తున్న తమన్నా హిందీలో మరో రెండు సినిమాలు చేస్తుంది.