Sai Tej : ఆ హీరోయిన్ ని వెంటనే అరెస్ట్ చేయండంటున్న సాయి ధరం తేజ్..!

సీతారామం సినిమాలో హీరోయిన్ గా నటించిన మృణాల్ ఠాకూర్ ని వెంటనే అరెస్ట్ చేయాలని అంటున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ (Sai Tej ). రీసెంట్ గా ఆమె నటించిన సీతారామం సినిమా చూసి ఆ సినిమా వల్ల తను పొందిన అనుభూతిని చెబుతూ ఓ పెద్ద లెటర్ రాశాడు సాయి తేజ్. ఈ క్రమంలో అందరికి వెరైటీగా ఐ హేట్ యు అంటూ రాసుకొచ్చాడు. అంతేకాదు మృణాల్ ఠాకూర్ గురించి చెబుతూ ఆమె పేరు మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయండి. ఆమె మీద కంప్లైంట్ తీసుకుని అరెస్ట్ చేయండి అంటున్నాడు సాయి ధరం తేజ్. ఎంతోమంది హృదయాలను ఆమె గాయపరచింది. తాను హేట్ యు అని మర్చిపోయి వేరేది చెప్పేలోగా వెంటనే ఆమె ని అరెస్ట్ చేయండి అంటూ సాయి ధరం తేజ్ తన లెటర్ లో రాసుకొచ్చాడు.

అంతేకాదు సినిమా హీరో దుల్కర్ సల్మాన్, డైరక్టర్ హను రాఘవపుడి, రష్మిక మందన్న, సుమంత్ ఇలా అందరికి హేట్ యు చెబుతూ సినిమా తనకెంత నచ్చిందో చెప్పుకొచ్చాడు సాయి ధరం తేజ్ (Sai Tej ). లాస్ట్ ఫ్రై డే రిలీజైన సీతారామ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా రోజు రోజుకి మరింత క్రేజ్ తెచ్చుకుంటుంది. ఈ సినిమాతో రిలీజైన బింబిసార కూడా సూపర్ హిట్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది.

బింబిసార, సీతారామం సినిమాల వల్ల చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ లు కళకళలాడుతున్నాయి.

Tags: Bimbisara, Dulquer Salman, Mega Hero, Mrunal Thakur, Rashmika Mandanna, Sai Dharam Tej, Sai Tej, Sitharamam, Tollywood