ఒకప్పుడు టాలీవుడ్ ని ఊపేసిన టబు బాలీవుడ్ కి వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది. ముదురు భామ అయినా కూడా ఇప్పటికీ హిందీ సినిమాల్లో నటిస్తుంది Tabu . అంతేకాదు స్టిల్ ఆమె బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయని అంటుంది టబు. అంతేకాదు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తల్లి కావాలంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది. పెళ్లి చేసుకోకుండానే తల్లి అవ్వొచ్చు కదా. సరోగసి ద్వారా పిల్లల్ని కనొచ్చని అంటుంది.
పెళ్లి చేసుకోకపోయినా.. తల్లి కాకపోయినా ఏం కాదని అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది టబు. ఇప్పటికీ బాలీవుడ్ లో హాట్ ఫేవరెట్ గా కొనసాగుతున్న టబు తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించింది. అయితే తెలుగులో ఆమెకు ఛాన్సులు వస్తున్నా సరే ఎందుకో అమ్మడు పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదని తెలుస్తుంది. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో మదర్ రోల్ లో మెప్పించింది టబు.
Tabu తెలుగు ఆడియెన్స్ కి ఒక హాట్ హీరోయిన్.. ఆమె కి ఇప్పుడు కూడా తెలుగులో సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. మరి వారి కోసమైనా టబు తెలుగు సినిమాలు చేయాలని కోరుతున్నారు. అయితే టబు మాత్రం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ వస్తుంది.