Keerti Suresh : స్లీవ్ లెస్ సొగసులతో మహానటి..!

నటనలో తనకు తానే సాటి ఆమె ఒక మహానటి అనిపించుకుంది మళయాళ భామ కీర్తి సురేష్ (Keerti Suresh). మొన్నటిదాకా కేవలం అభినయం మ్మాత్రమే చాలనుకున్న కీర్తీ సురేష్ ఇప్పుడు తన గ్లామర్ సైడ్ కూడా చూపించి మెప్పించాలని చూస్తుంది. సూపర్ స్టార్ మహేష్ తో నటించిన సర్కారు వారి పాట సినిమాలో కీర్తీ సురేష్ కెరియర్ లో ఎప్పుడూ చేయనటువంటి రేంజ్ లో గ్లామర్ తో రెచ్చిపోయింది. ఇక మీదట తాను కూడా గ్లామర్ షోకి రెడీ అని హింట్ ఇచ్చేసింది.

అంతేకాదు ఇక తన సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో కూడా అలరిస్తుంది అమ్మడు. లేటెస్ట్ గా కీర్తీ సురేష్ (Keerti Suresh) స్లీవ్ లెస్ డ్రెస్ తో ఫోటోలని షేర్ చేసింది. యాష్ కలర్ డ్రెస్ తో మెరుపులు మెరిపిస్తున్న కీర్తీ సురేష్ స్లీవ్ లెస్ సోగసులను అల్లేస్తుంది. ప్రస్తుతం నాని దసరా సినిమాలో నటిస్తున్న అమ్మడు మరోపక్క మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంది. ఈ రెండు సినిమాలతో తెలుగులో మళ్లీ టాప్ లేపాలని చూస్తుంది కీర్తీ సురేష్.

కేవలం అభినయంతోనే కాదు అందంతో కూడా మెప్పించాలని చూస్తున్న కీర్తీ సురేష్ కి తెలుగు ఆడియెన్స్ సపోర్ట్ చేస్తారని చెప్పొచ్చు. కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే ఫీమేల్ సెంట్రిక్ సినిమాల్లో కూడా అమ్మడు నటిస్తూ మెప్పిస్తుంది.

Tags: Keerthi, Keerthi Suresh Photoshoot, Keerti Suresh, mahanati, Tollywood