ప్రాణ‌మున్నంత వ‌ర‌కూ వైసీపీలోనే కొన‌సాగుతా..

ఎస్వీబీసీ చాన‌ల్ మాజీ చైర్మ‌న్, న‌టుడు, వైసీపీ నాయ‌కుడు పృథ్వీరాజ్ గురించి తెలిసి విష‌యం తెలిసిందే. చాన‌ల్ ఉద్యోగితో స‌ర‌స‌న సంభాష‌ణ‌ల‌కు పాల్ప‌డగా, అందుకు సంబంధించిన ఆడియో టేపు లీక్ కావ‌డంతో సోష‌ల్ మీడియాలో దుమారం రేగింది. ప‌విత్ర టీటీడీకి సంబంధించిన ప‌ద‌విలో అలాంటి కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డ‌డ‌మేంట‌ని తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీనిపై సీఎం జ‌గ‌న్ సైతం ఫైర్ అయ్యార‌ని వైసీపీ పార్టీ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకున్నారు అప్ప‌ట్లో. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న చైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇక ఇదే గాక అంత‌కు ముందు కూడా అమ‌రావ‌తి రైతుల‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వివాద‌స్ప‌దంగా మారాయి. బంగారు గాజులు వేసుకుని, కార్ల‌లో తిరుగుతూ ధ‌ర్నాలు చేస్తున్నార‌ని ఆయ‌న వ్యాఖ్య‌నించ‌డంపై ప్ర‌తిప‌క్ష నేత‌లేగాక‌, సొంత పార్టీ నేత‌లు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ‌రుస‌గా ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగిన నేప‌థ్యంలో కొంత‌కాలంగా ఆయ‌న మీడియాకు దూరంగా ఉన్నారు.

తాజాగా ఆయ‌న ఇటీవ‌లే తిరుమ‌ల‌లో మ‌రోసారి ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి స్వామివారిని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం మీడియాతో పృథ్వీరాజ్ మాట్లాడుతూ..
తన పై కుట్ర జరిగిందని, నమ్మిన వారే వెన్నుపోటు పొడిచారని ఆవేదన వక్తం చేశారు. రాజధాని రైతులను కించపరిచేలా తాను ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదని, వాటిని వ‌క్రీక‌రించార‌ని వాపోయారు. కుట్రపూర్వితంగా తనను ఎస్వీబీసీ నుంచి తప్పించారని, అందులో భాగంగా అడియో టేపులు లీక్ చేశార‌ని, త‌న‌న త‌ప్పించి పైశాచిక ఆనందం పొందారన్నారని మండిప‌డ్డారు. తాను సజ్జల, వైవీ, విజయసాయిరెడ్డిలకు మాత్రమే సమాధానం చెప్తానని వివ‌రించారు. తాను ఏ సామాజిక వర్గాన్ని కించపర్చలేదని అది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని, ఇక ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలో కొనసాగుతానని పృధ్వీరాజ్ స్పష్టం చేయ‌డం విశేషం.

Tags: amaravathi capital formers, cm jagan, svbc ex chairman pruthviraj