సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ ఫస్ట్ లుక్

సూపర్ స్టార్ రజనీకాంత్ యువ దర్శకుడు నెల్సన్తో తన తదుపరి చిత్రానికి సంతకం చేశారు ఈ చిత్రానికి ‘జైలర్’ అనే పేరు పెట్టారు. చాలా రోజుల క్రితమే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాగా, ఈరోజు షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ సందర్భంగా రజనీకాంత్ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ ఈరోజు ఆవిష్కరించారు. విడుదలైన పోస్టర్‌లో క్యాజువల్స్‌లో గ్రే షేడ్స్‌తో రజనీకాంత్ సీరియస్ మోడ్‌లో కనిపించారు. ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ చిత్రీకరణ మరో రెండు వారాల పాటు కొనసాగనుంది. ‘జైలర్’ షూటింగ్ కోసం ఓ ప్రైవేట్ స్టూడియోలో భారీ సెట్లు వేస్తున్నారు.

‘జైలర్‌’లో ఐశ్వర్యరాయ్ బచ్చన్ కథానాయికగా కనిపించనుంది.ఈ ప్రాజెక్ట్ కోసం రజనీకాంత్ 150 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారు. సన్ పిక్చర్స్ ఈ భారీ-బడ్జెట్ కమర్షియల్ కేపర్‌ని నిర్మిస్తోంది మరియు అనిరుధ్ సంగీత స్వరకర్తగా బోర్డులో ఉన్నారు. జైలర్‌లో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags: jailer movie first look, kollywood news, Rajinikanth, superstar rajinikanth jailer movie.