సౌత్ స్టార్ హీరోయిన్ రోజా (Roja) ప్రస్తుతం పొలిటికల్ గా కూడ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. హీరోయిన్ గా రోజా దాదాపు అప్పటితరం హీరోలందరితో నటించింది. రోజా తమిళ దర్శకుడు సెల్వమణిని ప్రేమించి పెళ్లాడింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోజా కూతురు అన్షు మాలిక హీరోయిన్ లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది.
రోజా (Roja) తన కూతురిని హీరోయిన్ గా ఎంట్రీ ఇప్పించాలని చూస్తుందట. అందుకే అన్షు మాలికని ఫారిన్ లో యాక్టింగ్ ఇన్ స్టిట్యూట్ లో జాయిన్ చేశారని తెలుస్తుంది. అన్షు మాలిక టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయ్యిందని టాక్. స్టార్ హీరో తనయుడి సినిమాలో హీరోయిన్ గా అన్షు మాలిక నటిస్తుందని అంటున్నారు.
ఇప్పటికే అడపాదడపా రోజాతో కలిసి దిగిన ఫోటోలతో అన్షు మాలికకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. హీరోయిన్ గా అన్షు మాలికకు మంచి కెరియర్ ఉంటుందని ప్రేక్షకులు అంటున్నారు.