కులాల పై షాకింగ్ కామెంట్స్ చేసిన లోక్‌సభ మాజీ స్పీకర్ మెయిరా కుమార్ ..

రాజస్థాన్ లో దళిత విద్యార్థిపై జరిగిన అమానుష దాడి ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. రాజస్థాన్ లోని జాలోర్ జిల్లాలో తాగునీటి కుండను ముట్టుకున్నాడన్న కారణంతో ఓ దళిత విద్యార్థిని .. అక్కడి ఉపాధ్యాయుడు కొట్టి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. రాజస్థాన్ లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కావడంతో.. ఆ పార్టీపై కూడా విమర్శలు వచ్చాయి. కాగా ఈ ఘటనపై లోక్ సభ మాజీ స్పీకర్ ఎంతో సున్నితంగా స్పందించారు. తనదైన శైలిలో ఆమె ఘటనను ఖండించారు.

‘ రాజస్థాన్ లో జరిగిన ఘటన నిజంగా అమానుషం. ఈనాటికి దేశంలో కుల వివక్ష ఉండటం అమానుషం. 100 ఏళ్ల క్రితం నా తండ్రి బాబు జగ్జీవన్ రామ్ కూడా ఇటువంటి ఎన్నో అవమానాలు పొందారు. కానీ ఆ రోజుకు కూడా ఇటువంటి ఘటనలు జరగడం దారుణం. అయితే ఇందుకు ఏ ఒక్క రాజకీయపార్టీనో విమర్శించలేం. సమాజంలో వేళ్లూనుకొని ఉన్న కులవ్యవస్థే ఇందుకు కారణం. కులవ్యవస్థ నిర్మూలన జరిగినప్పుడు ఇటువంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉంటాయి. కాంగ్రెస్ హయాంలోని రాష్ట్రంలోని జరిగింది కాబట్టి.. మీ స్పందన ఏమిటని చాలా మంది నన్ను అడుగుతున్నారు. నేను చెప్పేది ఒక్కటే.. రాజకీయాలు కచ్చితంగా సమాజాన్ని ప్రతిబింబిస్తాయి.

అయితే రాజస్థాన్ లో జరిగిన ఘటనను కేవలం ఒక్కపార్టీకి మాత్రమే అంటగట్టడం సరికాదు. ఇది మొత్తం సమాజాన్ని ప్రతిబింబిస్తుంది.’ అని ఆమె పేర్కొన్నారు. ‘ అందరూ కలిసి కుల జాడ్యాన్ని నిర్మూలించాలి. ఏ ప్రభుత్వానికో పార్టీకో ఇటువంటి ఘటనను ఆపాదించలేం. కులవ్యవస్థ నిర్మూలనే ఏకైక పరిష్కారం. ఓ పార్టీ అధికారంలో ఉన్నందున ఆయా రాష్ట్రాల్లోనే ఎక్కువ ఘటనలు జరుగుతున్నాయని చెప్పలేం. దురాచారాన్ని నిర్మూలించేందుకు సమాజం ముందుకు రావాలి. ద్వేష రహిత విధానం అవలంభించాలి.’ అని ఆమె పేర్కొన్నారు.

Tags: former loksabha speaker, loaksabha speaker, meira kumar, political news, politics