Mahesh : సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబోలో హ్యాట్రిక్ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే. రామోజి ఫిల్మ్ సిటీలో సినిమాకు సంబందించిన యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ని దసరా కానుకగా రిలీజ్ చేస్తారట. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటుగా టైటిల్ కూడా అప్పుడే వస్తుందని తెలుస్తుంది.
మహేష్, త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే కమర్షియల్ గా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడని అవి బుల్లితెర మీద మాత్రం తెగ ఆడేశాయి. అయితే ఈ హ్యాట్రిక్ మూవీ ఆ రెండు సినిమాలకు మించి ఉంటుందని అంటున్నారు.
Mahesh స్టామినాకు తగిన కథతోనే త్రివిక్రం ఎస్.ఎస్.ఎం.బి 28 సినిమా చేస్తున్నారట. ఈ సినిమా విషయంలో మహేష్ చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది. దసరా కి వచ్చే టైటిల్ పోస్టర్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చెప్పబోతున్నారట. అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రం చేస్తున్న సినిమాగా మహేష్ సినిమా భారీ అంచనాలతో వస్తుంది. తప్పకుండా ఈ సినిమా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని కాలర్ ఎగురవేసేలా చేస్తుందని అంటున్నారు.
2023 ఏప్రిల్ 28కి ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ తన నెక్స్ట్ సినిమా రాజమౌళి డైరక్షన్ లో చేస్తున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ గా ప్లాన్ చేస్తున్నట్టు టాక్.