Vijay Devarakonda : లైగర్ ని అక్కడైనా చూస్తారా..?

Vijay Devarakonda హీరోగా పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా లైగర్. రిలీజ్ ముందు నానా హడావిడి చేసిన ఈ సినిమా రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర బోళ్తా కొట్టింది. పాన్ ఇండియా స్థాయిలో విజయ్ తన సత్తా చటుతాడని అనుకోగా అనూహ్యంగా ఈ సినిమా డిజాస్టర్ కా బాప్ అనిపించింది. సినిమాలో కేవలం విజయ్ తప్ప ఏది వర్క్ అవుట్ అవలేదు. అందుకే సినిమా ఆ రేంజ్ లో ఫ్లాప్ అయ్యింది.

ఇక ఇదిలాఉంటే లైగర్ సినిమా డిజిటల్ రిలీజ్ కి సిద్ధమైంది. సెప్టెంబర్ 22న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో లైగర్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ లో అయినా ఆడియన్స్ ని మెప్పిస్తుందా లేదా అన్నది చూడాలి. పూరీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్న విజయ్ కి లైగర్ నిరాశ కలిగించింది. అయితే ఈ సినిమా పోయిందని బాధపడకుండా నెక్స్ట్ సినిమా మీద ఫోకస్ పెట్టాడు విజయ్.

శివ నిర్వాణ డైరక్షన్ లో ఖుషి సినిమా చేస్తున్నాడు Vijay Devarakonda. ఆ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్, సమంతల లవ్ స్టోరీగా ఖుషి క్రేజీగా రాబోతుంది. మరి ఈ సినిమాతో అయినా విజయ్ హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి. లైగర్ రిలీజ్ అవకుండానే పూరీతో జన గణ మన సినిమా ఫిక్స్ చేసుకున్నాడు విజయ్. అయితే లైగర్ రిజల్ట్ చూశాక ఆ సినిమా చేయాలా వద్దా అన్న కన్ ఫ్యూజన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి విజయ్ జన గణ మన చేస్తాడా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో క్లారిటీ వస్తుంది.

Tags: disney hotstar, liger, puri jagannath, Tollywood, Vijay Devarakonda