Samantha : సమంత అనారోగ్యంపై మేనేజర్ షాకింగ్ కామెంట్స్..!

Samantha : స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్య పాలైనట్టుగా కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఎప్పుడూ తన అప్డేట్స్ తో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ఈమధ్య అసలు కనిపించడం లేదు. అయితే సమంత ఏదో సర్జరీ కోసం యూఎస్ వెళ్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఫైనల్ గా ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాడు సమంత మేనేజర్. సమంతకి ఎలాంటి అనారోగ్యం కాలేదని.. ఆమె బాగానే ఉన్నారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు సమంత గురించి మీడియాలో వస్తున్న వార్తలన్ని అబద్ధమని చెప్పుకొచ్చాడు.

సమంత ప్రస్తుతం గుణశేఖర్ డైరక్షన్ లో వస్తున్న శాకుంతలం, యశోద సినిమాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది అమ్మడు. కమర్షియల్ సినిమాల కన్నా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది సమంత. తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా సమంత వరుస వెబ్ సీరీస్, సినిమాలు చేస్తుంది. సమంతకి బాలీవుడ్ లో కూడా క్రేజ్ తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

డైవర్స్ తర్వాత సినిమాల మీదే ఎక్కువ దృష్టి పెట్టిన సమంత ఇటు తెలుగు అటు హిందీ సినిమాల మీద ఫోకస్ పెట్టింది. బాలీవుడ్ లో పాగా వేయాలని గట్టి ప్రయత్నాల్లో ఉంది సమంత. మొత్తానికి సమంతకి ఏదో అయ్యిందని ఫ్యాన్స్ కంగారు పడుతుంటే ఆమె మేనేజర్ వచ్చి ఈ న్యూస్ కి బ్రేక్ పడేలా చేశాడు.

Tags: Samantha, Samantha Health News, Samantha Manager, Samantha Updates, Webseries