సూపర్ గుడ్ ఫిల్మ్స్ వందో చిత్రంలో స్టార్ హీరో.. ఎవరంటే..!

తెలుగులో సుస్వాగతం, సూర్యవంశం, రాజా, అందాల రాముడు, సంక్రాంతి, గోరింటాకు వంటి సినిమాలను నిర్మించింది సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ. ఈ సంస్థ తన వందో చిత్రం గా తమిళ స్టార్ హీరో విజయ్ తో ఓ సినిమా నిర్మించనుంది. ఇందుకు సంబంధించి అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చింది. సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు, ప్రముఖ హీరో జీవా మాట్లాడుతూ తమ సంస్థ నిర్మిస్తున్న ఓ చిత్రంలో తమిళ అగ్ర హీరో విజయ్ నటిస్తున్నట్లు తెలిపాడు.

విజయ్ కి కథ వినిపించగా ఆయనకు నచ్చడంతో ఈ సినిమాలో నటించేందుకు అంగీకారం తెలిపినట్లు వెల్లడించాడు. తనకు కూడా ఈ సినిమాలో నటించాలని ఉందని తన తండ్రిని కోరినట్లు చెప్పాడు. కాగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ హీరోగా గతంలో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. కాగా ప్రస్తుతం విజయ్ దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు తెలుగులో వారసుడు అనే పేరు పెట్టారు.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లో విజయ్ తన తదుపరి చిత్రం చేసే అవకాశం ఉంది. ఇటీవల విక్రమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న లోకేష్ కనకరాజు దర్శకత్వంలో, అలాగే గౌతం వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మరో సినిమాలో విజయ్ నటించనున్నాడు.

Tags: hero vijay, super good films, tollywood gossips, tollywood news