బావమరిదిని ఎన్టీఆర్ పట్టించుకోవడం లేదా?.. నితిన్ సినిమా ఏమైంది?

జూనియర్ ఎన్టీఆర్ గురించి అందరికీ తెలిసిందే.. నందమూరి వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. తన నటనతో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు.. నందమూరి కుటుంబంలో బాలయ్య తర్వాత అంతటి క్రేజ్ తారక్ కే వచ్చింది.. వారుసులుగా వచ్చిన చాలా మంది స్టార్ స్టేటస్ అందుకున్నారు. అయితే కొంత మంది మాత్రం ఎన్ని ప్రయాత్నాలు చేసినా స్టార్స్ కాలేకపోయారు. కానీ ఆ విషయంలో తారక్ మాత్రం వారసత్వాన్ని నిలబెట్టుకున్నారు..

ఎన్టీఆర్ తరపు నుంచి ఆయన బావమరిది నితిన్ చంద్ర హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఆయన ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు.. అయితే నితిన్ ఎంట్రీకి సంబంధించిన వార్తలు గతేడాది నుంచి వస్తూనే ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ సమయంలో షూటింగ్ ప్రారంభమైంది. కానీ ఇప్పటి వరకు పూర్తి కాలేదు.. ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ బావమరిది సినిమా అంటే కొంత హైప్ ఉంటుంది. కానీ నితిన్ విషయంలో ఆ హైప్ కనిపించడం లేదు. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ ను పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ కొంత దృష్టి పెడితే బావమరిది నితిన్ మొదటి సినిమాకు అంచనాలు పెరిగే ఛాన్స్ ఉంటుంది..

ఇక ఇటీవల కాలంలో ఎన్టీఆర్ ఏదైనా ఈవెంట్ కి వెళ్తే ఆ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.. దీంతో ఆయన బావమరిది సినిమాపై ఫోకస్ చేస్తే ఆ సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని అనుకుంటున్నారు.. మరీ ఎన్టీఆర్ బావమరిది సినిమా విషయంలో జోక్యం చేసుకుంటారో లేదో చూడాలి. మరోవైపు నితిన్ చంద్ర తన మొదటి సినిమా విడుదల కాకముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమాలో నితిన్ ముగ్గురు హీరోల్లో ఒకరిగా కనిపిస్తారని సమాచారం.. అయితే కెరీర్ స్టార్టింగ్ లోనే రిస్కీ ప్రాజెక్టులను నితిన్ కెరీర్ కి మంచిది కాదని కొందరు చెబుతున్నారు.

Tags: brother in law, jr ntr, latest, movie event, Tollywood, viral