గాడ్ ఫాదర్ నుంచి సత్య దేవ్ ఫస్ట్ లుక్.. మూవీపై మరింత పెరిగిన క్యూరియాసిటీ..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాకు ఇది రీమేక్. పొలిటికల్ డ్రామా గా ఈ మూవీ తెరకెక్కుతోంది. చిరంజీవి మాఫియా డాన్ గా, పొలిటికల్ లీడర్ గా నటిస్తున్నారు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో యంగ్ హీరో సత్యదేవ్ నటిస్తుండగా.. అతడి సరసన ప్రముఖ హీరోయిన్ నయనతార కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

చిరంజీవి మొదటి సారి పెప్పర్ లుక్ లో ఆకట్టుకున్నాడు. కాగా తాజాగా ఈ సినిమాలో సత్యదేవ్ పాత్ర ను రివీల్ చేస్తూ అతడి పాత్రను పరిచయం చేశారు. పొలిటికల్ లీడర్ గా జయ దేవ్ పాత్రలో సత్య దేవ్ ఒదిగి పోయాడు. ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా కొద్ది రోజుల కిందట ఈ సినిమాలో నటిస్తున్న నయనతార పాత్రను సత్య ప్రియ జయదేవ్ గా పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా వచ్చే నెల 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్.బి.చౌదరి, ఎన్. వి ప్రసాద్ నిర్మిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు. ఆచార్య సినిమా ప్లాప్ తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న గాడ్ ఫాదర్ సినిమాపై అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు.

Tags: chiranjeevi, god father movie, satya dev, tollywiid movies, tollywod news, tollywood gossips