జిన్నా మూవీ అప్డేట్ : క్యూట్ లుక్ లో హాట్ గా సన్నీలియోన్..!

మంచు విష్ణు హీరోగా పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా జిన్నా అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మంచు విష్ణు గాలి నాగేశ్వరరావు పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయ్యింది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సన్నీలియోన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేశారు.

స్కర్ట్ వేసుకొని గాగుల్స్ పెట్టుకొని స్టైల్ గా పల్లె వెలుగు బస్సు నుంచి సన్నీలియోన్ దిగుతున్న పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో సన్నీలియోన్ క్యూట్ లుక్ లో అదిరిపోయేలా ఆకట్టుకుంటోంది. ఈ ఫోటో ట్విట్టర్ వేదికగా విడుదల కాగానే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఇందుకు సంబంధించి మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ముగ్గురు స్నేహితుల కథతో ఈ సినిమా చేస్తున్నారు. తాజాగా విడుదలైన సన్నీలియోన్ ఫోటోను చూస్తుంటే పల్లెటూరు నుంచి పల్లె వెలుగు బస్సు లో పట్టణానికి వచ్చినట్లుగా ఆమెను చూపించారు. ఆమె పాత్ర పేరును రేణుకగా పరిచయం చేశారు. కాగా ఈ సినిమాకు కోన వెంకట్ కథ స్క్రీన్ ప్లే అందించడంతోపాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.

Tags: Ginna Movie, manchu vishnu, paayal rajput, Sunny Leone, tollywood news