ప్లీజ్.. నాలా టాటూలు వేయించుకోకండి.. ఫ్యాన్స్ కి చైతూ రిక్వెస్ట్..!

తన రెండవ సినిమా ఏం మాయ చేశావే సినిమాతో స్టార్ గా మారాడు నాగచైతన్య. అదే సినిమాలో నటించిన హీరోయిన్ సమంత ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్లపాటు వారి దాంపత్యం అన్యోన్యంగా సాగింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ వారిద్దరూ విడిపోయారు. విడాకులు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం నాగచైతన్య బాలీవుడ్లో లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కోసం చైతూ బాలీవుడ్ లో ఇంటర్వ్యూలకు హాజరు అవుతున్నాడు. ఈ సందర్భంగా చైతన్య కు తన పర్సనల్ లైఫ్ గురించి, సమంత గురించి ఎక్కువగా ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో చైతూను తన చేతి మణికట్టుపై వేసుకున్న పచ్చబొట్టు గురించి పలువురు విలేకరులు ప్రశ్నించారు. దాని అర్థం ఏమిటి? అని అడిగారు. ఈ సందర్భంగా చైతూ స్పందిస్తూ.. ‘సమంతకు నాకు జరిగిన పెళ్లి రోజుని పచ్చబొట్టుగా వేయించుకున్నా. అయితే చూసే వారికి అది డేట్ లా కనిపించకుండా వేసుకున్నా. ఇటీవల కొంతమంది నా అభిమానులను కలిశా. వారు కూడా అలాగే టాటూ వేయించుకున్నారు. ఇంటర్వ్యూ ద్వారా అభిమానులకు ఒక విషయాన్ని చెబుతున్నా. ఎవరూ తమ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను టాటూగా వేయించుకోకండి. ఆ విషయాలు భవిష్యత్తులో మారిపోవచ్చు. కానీ పచ్చబొట్టు అలాగే ఉండిపోతుంది. ఈ విషయంలో ఎవరూ నన్ను ఫాలో కాకండి. ‘ అని చైతన్య పేర్కొన్నారు.

ప్రస్తుతం మీరు సమంత విడి పోయారు కదా.. ఆ పచ్చబొట్టు మార్చుకోవాలని అనిపించలేదా అని చైతన్యను విలేకరులు ప్రశ్నించగా ‘ ఆ పచ్చబొట్టు తొలగించుకోవాలని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఎందుకంటే అది ఉండడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు’ అని చైతన్య సమాధానం ఇచ్చాడు. చైతన్యతో పెళ్లయిన కొత్తలో సమంత కూడా చైతూకు సంబంధించి తన బాడీపై ఒక టాటూ వేయించుకుంది. అయితే ఆ తర్వాత ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జీవితంలో ఎప్పుడూ కూడా టాటూ వేయించుకోవద్దని అభిమానులకు సూచించింది. సమంత కు సంబంధించిన జ్ఞాపకాన్ని చైతూ ఇప్పటికీ ఉంచుకోవడంపై అభిమానులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

Tags: naga chaitanya samantha tattoo, naga chaitanya tattoo, tollywood news