ఇండియాలో ఎక్కువ ప్లాప్స్ ఇచ్చిన స్టార్ ని నేనే.. అని నా ఫీలింగ్.. స్టార్ హీరో కామెంట్స్..!

20 ఏళ్ల కిందట తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో తెలుగు తెరపైకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నితిన్. తన తొలి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా చాలా థియేటర్లలో 200 రోజులకు పైగా ఆడింది. ఇక నితిన్ వినాయక్ దర్శకత్వంలో చేసిన రెండో సినిమా దిల్. ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో నితిన్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో సై అనే సినిమా కూడా చేశాడు నితిన్. స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కూడా అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

ఇక అప్పట్నుంచి నితిన్ కు వరుసగా రావడం ప్లాప్స్ మొదలైంది. వరుసబెట్టి ఎన్ని సినిమాలు చేసిన ఏళ్ల తరబడి ఆయనకు ఒక్క హిట్ కూడా దక్కలేదు. సుమారు 8 సంవత్సరాల తర్వాత విక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఇష్క్ సినిమాతో నితిన్ మళ్ళీ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాతోనే నితిన్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ఆ తర్వాత వెంటనే గుండెజారి గల్లంతయ్యిందే వంటి హిట్ సినిమాలో నటించాడు నితిన్.

ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజకవర్గం అనే సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఆయన తనకు ఎదురైన ప్లాప్స్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ 20 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో హిట్ సినిమాలు తీశాను. అందులో కొన్ని ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అలా వరుసగా ప్లాప్ వస్తున్న సమయంలో నాకు ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు. ఇండియాలో నాకన్నా ఎక్కువ ఫ్లాప్స్ ఇచ్చినా హీరోలు ఎవరైనా ఉన్నారా.. అని గూగుల్లో సెర్చ్ చేసేవాణ్ని. అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ పేర్లు గూగుల్లో కనిపిస్తుండడంతో వాళ్లని చూసి స్ఫూర్తి పొందే వాడిని. అయితే ఫ్లాప్ సినిమా చేసిన ప్రతిసారీ నాపై విమర్శలు వచ్చేవి. అని బాధ కలిగించినప్పటికీ పాజిటివ్ గానే తీసుకొని నా ప్రయాణాన్ని కొనసాగించాను.’ అని నితిన్ కామెంట్స్ చేశాడు

Tags: hero nitin, tollywod news, tollywood gossips, tollywood heros