విజయ్ దేవరకొండ లైగర్ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే సినిమాపై సూపర్ బజ్ ఏర్పడగా ఓపెనింగ్ డే అదిరిపోయే కలక్షన్స్ రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పూరీ జగన్నాథ్ తో సెన్సేషనల్ డైరక్టర్ సుకుమార్ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. పుష్పతో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన సుకుమార్ లైగర్ కూడా పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న ఈ టైం లో ఆ టీం కి సపోర్ట్ గా లైగర్ డైరక్టర్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ చేశారు.
ఇద్దరు తోపు డైరక్టర్స్ (Sukumar Puri)ఇలా కలిసి ఒకేచోట కనబడటం ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. పూరీ దగ్గర సుకుమార్ ఫ్యాన్ బోయ్ మూమెంట్ గా బద్రి టైం లో మీ దగ్గర అసిస్టెంట్ గా ట్రి చేశానని చెప్పాడు సుక్కు. అంతేకాదు తన సినిమాల్లో పాత్రలకు పూరీ స్పూర్తి అని అన్నారు. ఇక లైగర్ కి సంబందించిన విషయాలను కూడా ప్రస్థావించారు.
ఇక పూరీ కూడా పుష్ప సినిమా క్యారక్టరైజేష్.. డీటైలింగ్ గురించి బాగా ఎనాలసిస్ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఇద్దరు Sukumar Puri మాట్లాడుకోవడం లాంటిది బాగా హైలెట్ అయ్యిందని అన్నారు. ఇలా లైగర్ గురించి ప్రమోట్ చేస్తూ సుకుమార్ పూరీ ఇంటర్వ్యూ సూపర్ గా అనిపించింది.