జాతిరత్నాలు సినిమాతో రైటర్ గా దర్శకుడిగా తన సత్తా చాటిన అనుదీప్ కెవి ప్రస్తుతం తమిళ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఈ ఇయర్ దీపావళికి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక ఈలోగా అనుదీప్ కెవి కథతో ఫస్ట్ డే ఫస్ట్ షో (FDFS ) సినిమా వస్తుంది. ఒకప్పటి కళాత్మక సినిమాలు అందించిన పూర్ణోదయ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కింది.
అనుదీప్ కెవి కథ అందించగా వంశీ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. సినిమాలో శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు లీడ్ రోల్ లో వస్తున్న FDFS సినిమా ట్రైలర్ ని నాచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. ట్రైలర్ విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన హీరో ఆ హీరో ఫస్ట్ డే టికెట్ ని ఎలా సంపాదించాడు అన్నది కథ.
ఈ సినిమా కూడా జాతిరత్నాలు టైప్ లోనే కామెడీగా నడిపించినట్టు ఉన్నారు. సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ముందు సినిమాని సెప్టెంబర్ 2న రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. మరి ఆ డేట్ న వస్తుందా లేదా అన్నది చూడాలి.