Vijay Devarakonda : లైగర్ ఫస్ట్ టాక్.. పూరీ మళ్లీ దెబ్బేశాడుగా..!

పూరి జగన్నాథ్ డైరక్షన్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda) లీడ్ రోల్ లో వచ్చిన సినిమా లైగర్. ఈరోజు పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న ఈ మూవీలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమాకి షోలు మరికొద్దిసేపట్లో మొదలవగా ఆల్రెడీ యూఎస్ లో ఈ సినిమా ప్రీమియర్స్ పూర్తయ్యాయి.

ఇక ప్రీమియర్స్ నుంచి వచ్చిన టాక్ చూస్తే లైగర్ లో విజయ్ పర్ఫార్మెన్స్ తప్ప సినిమాలో విషయం ఏమి లేదని అంటున్నారు. విజయ్ ( Vijay Devarakonda) కష్టానికి తగిన ప్రతిఫలం రాలేదని అంటున్నారు. పూరీ ఈ సినిమాతో తన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడని అంటున్నారు. రొటీన్ కథతో పూరీ ఏమాత్రం ఆకట్టుకోలేని కథనంతో ఈ సినిమా తీశాడని అంటున్నారు.

విజయ్ కష్టం మాత్రం తెరపై కనిపిస్తుంది. సినిమా ఎంత రొటీన్ గా అనిపించినా విజయ్ కోసం మాత్రం ఒకసారి చూసేయొచ్చని అంటున్నారు.

Tags: ananya pandey, liger, Liger Review, Vijay Devarakonda, Vijay Devarakonda Liger