రీసెంట్ గా ఓ సినిమా ఈవెంట్ కి సుధీర్ బాబు గెస్ట్ గా వెళ్లారు. ఆది సాయికుమార్, పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమా ఈవెంట్ లో పాయల్ రాజ్ పుత్ టోన్ జీన్స్ వేసుకుని వచ్చింది. అయితే ఆ ప్యాట్ మోకాళ్ల దగ్గర మరీ చ్రిగినట్టే ఉంది. అది చూసిన సుధీర్ బాబు పాయల్ మొదటి సినిమా గురించి పొగుడుతూనే తన దగ్గర డబ్బులు లేవనుకుంటా చిరిగిన ప్యాంట్ వేసుకుందని జోక్ చేశాడు.
అయితే స్టేట్మెంట్ ని సుధీర్ బాబు కామెడీగా అన్నాడని పాయల్ (Payal Rajput) కూడా నవ్వేసింది. కానీ ఆమె ఫ్యాన్స్ మాత్రం హర్ట్ అయ్యారు. నువ్వు సిక్స్ ప్యాక్ అని బాడీ మొత్తం చూపిస్తే ఏం లేదు కానీ ఆమె అలా చిరిగిన ప్యాంట్ వేసుకుంటే తప్పేం లేదని కామెంట్స్ పెడుతున్నారు. అయితే పాయల్ ని ఏడిపించే ఉద్దేశంతోనే సుధీర్ బాబు సరదాగా అన్నాడే తప్ప అతని ఉద్దేశంలో ఆమెని ఏదో అనాలని కాదు.
కానీ సుధీర్ పై రకరకాల కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు నెటిజెన్లు. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ మంచు విష్ణుతో జిన్నా అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో సన్నీ లియోన్ కూడా నటించడం విశేషం. రీసెంట్ గా రిలీజైన జిన్నా టీజర్ పై పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఢీ తరహాలో మంచు విష్ణు కామెడీ అటెంప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.