మహేష్ తో సినిమా ఎలా ఉండబోతుందో.. గ్లోబల్ వేదికపై చెప్పేసిన రాజామౌళి..

రాజమౌళి ఒక పేరు కాదు.. ఇప్పుడు ఒక బ్రాండ్.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు జక్కన్న.. ఆర్ఆర్ఆర్ తో ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేశాడు.. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశాడు.. ఆర్ఆర్ఆర్ తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంటుందని రాజమౌళి గతంలోనే చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చాడు జక్కన్న.

ప్రస్తుతం యూఎష్ టూర్ లో ఉన్న రాజమౌళి.. అక్కడ జరుగుతున్న ఓ ఫిలిం ఫెస్టివల్ కి హాజరయ్యారు. ఈ వేదికపై మహేష్ తో సినిమాపై స్పందించాడు. తన నెక్ట్స్ మూవీ గ్లోబల్ మొత్తం ట్రావెల్ అయ్యే ఒక అడ్వెంచర్ మూవీ అని స్పష్టం చేశాడు. ఇండియానా జోన్స్, జేమ్స్ బాండ తరహా యాక్షన్ అడ్వెంచర్ మూవీ తీయబోతున్నట్లు చెప్పాడు. ఈ జానర్ కు ఇండియన్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి ఓ కథ సిద్ధం చేయబోతున్నాడు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో షూట్ చేస్తామనే విషయాన్ని రాజమౌళి బయటపెట్టాడు.

మహేష్ బాబు మూవీ గురించి విజయేంద్ర ప్రసాద్ ఇదివరకే తెలిపారు. అయితే కథ ఫైనల్ కాలేేదని, మరికొన్ని లైన్స్ కూడా అనుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పుడు రాజమౌళి కన్ఫర్మ్ చేయడంతో మహేష్ మూవీ థీమ్ సెట్ అయినట్లు తెలుసతోంది. ఈ మూవీ ప్రధానంగా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగుతుంది. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లొకేషన్స్ లో ఈ సినిమాను చిత్రీకరించనున్నారు.

ఈ మూవీ కథపై విజయేంద్రప్రసాద్ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టారు. త్వరలోనే రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ కలిసి ఈ కథపై పూర్తిస్థాయిలో వర్క్ మొదలుపెడతారట.. రాజమౌళి కూడా ఇప్పటి వరకు ఇలాంటి సినిమా చేయలేదు. ఆయన ఎక్కువగా విదేశీ లొకేషన్స్ సెలెక్ట్ చేయరు. కానీ తొలిసారిగా రాజమౌళి తీస్తున్న సినిమా ఎక్కువగా పారెన్ లో షూట్ చేయనున్నట్లు తెలస్తోంది..

Tags: comments, latest news, mahesh babu, movie, rajamouli, viral