Adivi Sesh : నేను మ్యాగీలా కాదు.. స్టామినా ఎక్కువే.. రెజినా కామెంట్స్ కు అడివి శేష్ కౌంటర్..!

టాలీవుడ్ హీరోయిన్ రెజినా నటించిన శాకిని ఢాకిని సినిమా ఈ నెల 16న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో మగవాళ్లని మ్యాగీ పోల్చి కేవలం రెండు నిమిషాల్లో అయిపోతుందని కామెంట్ చేసింది రెజినా. ఆమె కామెంట్స్ లో అర్ధం ఏమిటో కానీ అందరికి అది వేరేలా అర్ధమైంది. ఈ క్రమంలో రీసెంట్ గా జరిగిన శాకిని ఢకిని ఈవెంట్ లో రెజినా చేసిన మ్యాగీ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చాడు అడివి శేష్.

తనకు స్టామినా ఎక్కువని.. తను షూటింగ్స్ లో కూడా ఎనర్జిటిక్ గా ఉంటానని అందరు అంటుంటారని.. మరి 2 మినిట్స్ సంగతి ఏంటి అని రెజినాని Adivi Sesh అడిగాడు .. అయితే దానికి ఆన్సర్ 2 నిమిషాలు ఆగాక చెబుతా అంది. అలా రెజినా చేసిన 2 మినిట్స్ కామెంట్ కి రెస్పాన్స్ ఇచ్చాడు అడివి శేష్ (Adivi Sesh). రెజినాతో పాటుగా ఈ సినిమాలో నివేదా థామస్ కూడా నటించింది.

కెరియర్ పరంగా వెనకపడ్డ రెజినా వెబ్ సీరీస్ లు చేస్తూ వెళ్లదీస్తుంది. నివేద కూడా దాదాపు అదే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ ఇద్దరి భామల ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన సుధీర్ వర్మ ప్రమోషన్స్, ఈవెంట్స్ కి దూరంగా ఉంటున్నారు. మేకర్స్ తో డైరక్టర్ కి డిఫరెన్సెస్ వచ్చాయని ఫిల్మ్ నగర్ టాక్.

Tags: Adivi Sesh, Evaru Jodi, Maggie Comment, Regina, Shakini Dhakini, Tollywood