Sudheer Babu : మైక్ పట్టుకుని మ్యా.. మ్యా అని నీళ్లు నమిలితే ఎలా బాసు..!

కొందరు హీరోలు మైక్ పట్టుకుంటే చాలు గళ గళా మాట్లాడేస్తారు. ఆడియన్స్ ని ఉప్పొంగేలా చేసేది.. వాళ్లకి ఎనర్జీ ఇచ్చేది హీరోల మాటలే. మా హీరో బాగా మాట్లాడతాడు అంటూ గొప్పలు కూడా చెప్పుకుంటారు. కానీ కొందరు హీరోలు మాత్రం సరిగా మాట్లాడలేరు. అది వారి తప్పేమి కాదు అలా జరిగిపోతుంది. లేటెస్ట్ గా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ఈవెంట్ లో కూడా ఆ సినిమా హీరో సుధీర్ బాబు కూడా అలానే ఏం మాట్లాడాలో అర్ధం కాక మ్యా మ్యా అని నీళ్లు నమిలాడు.

సినిమాని ప్రమోట్ చేసుకోవడంలో ఈవెంట్ అనేది చాలా ఇంపార్టెంట్.. ఆ ఈవెంట్ లో హీరో అలా మాట్లాడటం ఏంటని కొందరు అంటున్నారు. సుధీర్ బాబు (Sudheer Babu) మైక్ అందుకుని మధ్య మధ్యలో ఆలోచించుకోవడానికి టైం తీసుకోవడం కొందరికి నచ్చలేదు. తన సినిమా ఈవెంట్ లో తను ఏమి మాట్లాడకపోతే ఎలా అని అంటున్నారు ఆడియన్స్.

Sudheer Babu హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. సినిమాలో డైరక్టర్ గా సుధీర్ బాబు కనిపిస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.

 

Tags: AAMC Event, Hero Sudheer Babu, Sudheer, Sudheer Babu, Sudheer Babu Speech, Tollywood