Sreemukhi : రెండు రోజులకి 10 లక్షలు.. శ్రీముఖి రేంజ్ ఇదబ్బా..!

తెలుగు బుల్లితెర మీద టాప్ యాంకర్ లిస్ట్ లో శ్రీముఖి (Sreemukhi) కూడా ఉంటుంది. తన క్యూట్ లుక్స్ తో శ్రీముఖి చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక స్పెషల్ ఈవెంట్స్ లో ఆమె అందాల విందు కూడా ప్రేక్షకులకు అదనపు ఆకర్షణగా ఉంటాయి. ఇదిలాఉంటే శ్రీముఖి ప్రస్తుతం సైమా అవార్డ్ వేడుకల్లో పాల్గొన్నది. బెంగళూరులో జరిగిన ఈ ఈవెంట్ లో అలితో పాటుగా శ్రీముఖి కూడా యాంకర్ గా పాల్గొన్నది. ఈ ఈవెంట్ కోసం శ్రీముఖి భారీ డిమాండ్ చేసిందని తెలుస్తుంది.

తెలుస్తున్న సమాచారం ప్రకారం Sreemukhi సైమా అవార్డ్ వేడుకల యాంకర్ గా చేసినందుకు గాను 10 లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకుందని టాక్. రెండు రోజుల షో యాంకరింగ్ కి అంత రెమ్యునరేషన్ అంటే శ్రీముఖి రేంజ్ ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు. యాంకరింగ్ లో సుమ తర్వాత ఝాన్సి, అనసూయ ఇలా అందరు తమ సత్తా చాటుతుండగా శ్రీముఖి కూడా వరుస షోలు చేస్తూ దూసుకెళ్తుంది.

ముఖ్యంగా రియాలిటీ షోస్ లో శ్రీముఖి యాంకరింగ్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఆమె చిలిపి పనులకు ఆడియన్స్ కూడా భలే ఎంజాయ్ చేస్తారు. సైమాలో శ్రీముఖి సందడి అందరిని అలరించింది. అయితే ఈ షో టెలికాస్ట్ రైట్స్ ప్రముఖ ఛానెల్ కొనేసిందట. అది ఎప్పుడు ప్రసారం చేస్తారో తెలియాల్సి ఉంది.

Tags: SIIMA, siima awards, Sreemukhi, Sreemukhi Remuneration, Tollywood