రమ్యకృష్ణ – కృష్ణవంశీ డేటింగ్ స్టోరీలో మామూలు ట్విస్టులు కాదుగా…!

సినిమా ఇండ‌స్ట్రీలో ఎక్కువ‌గా హీరోలు హీరోయిన్ లు ప్రేమ‌లో ప‌డి పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. ఆ త‌ర‌వాత హీరోయిన్ లు ఎక్కువ‌గా ద‌ర్శ‌కుల‌తో ప్రేమ‌లో ప‌డి వారిని పెళ్లి చేసుకుంటారు. ఇక అలా పెళ్లి చేసుకున్న వారిలో కృష్ణ‌వంశీ ర‌మ్య‌కృష్ణ జంట కూడా ఒక‌టి. కృష్ణ‌వంశీ ఒక‌ప్పుడు టాలీవుడ్ లో టాప్ డైరెక్ట‌ర్ గా రానించాడు. డిఫ‌రెంట్ క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. ర‌మ్య‌కృష్ణ విష‌యానికి వ‌స్తే అప్ప‌ట్లో హాట్ బ్యూటీ అంతే కాకుండా స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగువెలిగింది.

ఇక ఇప్పటికీ కృష్ణ‌వంశీ డైరెక్ట‌ర్ గా సినిమాలు చేస్తున్నాడు. అంతే కాకుండా ర‌మ్య‌కృష్ణ కూడా న‌టిగా రానిస్తోంది. ఇక వీరిద్ద‌రూ విడిపోయార‌ని చాలా మంది అనుకుంటారు కానీ తాము క‌లిసే ఉన్నామ‌ని కృష్ణ‌వంశీ రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ర‌మ్య‌కృష్ణ చెన్నై లో ఉంటుందని…తాను సినిమాల కోసం హైద‌రాబాద్ లో ఉంటున్నాన‌ని చెప్పాడు. త‌మ కుమారుడు ర‌మ్య‌కృష్ణ వ‌ద్ద‌నే ఉంటున్నాడ‌ని చెప్పాడు. ఇదిలా ఉంటే వీరి ప్రేమ క‌థ‌లో కూడా ఎన్నో ట్విస్ట్ లు ఉన్నాయి.

వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌టానికి కార‌ణం ఓ పాట అని అప్ప‌ట్లో టాక్ ఉండేది. ఇక కృష్ణ‌వంశీ గులాబీ సినిమాతో ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమాలో మేఘాల‌లో తేలిపోతున్న‌ది అనే పాట ఉంటుంది. అయితే ఈ పాట‌నే ర‌మ్య‌కృష్ణ కృష్ణ‌వంశీల‌ను ఒక‌టి చేసింద‌ట‌. ఈ పాట చూసిన సినీ ప్ర‌ముఖులు అంతా కృష్ణ వంశీ టాలెంట్ కు ఫిదా అయ్యారు. అంతే కాకుండా ర‌మ్య‌కృష్ణ కూడా ఈ పాట చూసే కృష్ణ‌వంశీకి ఫ్లాట్ అయ్యింది.

ఆ త‌ర‌వాత పాట చిత్రీక‌రించిన ద‌ర్శ‌కుడు ఎవ‌రు అని ఆరా తీసింది. అంతే కాకుండా క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందంతో రిక‌మెండ్ చేయించుకుని మ‌రీ వెళ్లి కృష్ణ‌వంశీని క‌లిసింది. అలా క‌లుసుకున్న వీరిద్ద‌రూ మొద‌ట మంచి స్నేహితులు అయ్యారు. ఇక మ‌న‌సులు క‌ల‌వ‌డంతో ఒక‌రితో మ‌రొక‌రు ప్రేమ‌లో ప‌డ్డారు. ఆ త‌ర‌వాత పెళ్లి చేసుకున్నారు. ప్ర‌స్తుతం వీరి ప్రేమ‌కు గుర్తుగా ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అంతే కాకుండా వీరి రిలేష‌న్ షిప్ పై ఎన్నో రూమ‌ర్ లు వ‌చ్చినా ఇప్ప‌టికీ ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు చేసుకోకుండా టాలీవుడ్ లో సెల‌బ్రెటీ క‌పుల్ గా ఉంటున్నారు.

Tags: film news, filmy updates, intresting news, krishna vamsi, latest news, latest viral news, Love Story, ramya krishna, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, toolywood cute couple, trendy news, viral news