అపర్ణ నానామాటలని కృష్ణమూర్తి చేతులు బ్లాక్ చెక్ పెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు కనకం ఆగండి వదిన గారు మాకు పూటకు గతిలేకపోవచ్చు కానీ ఎదుటోళ్ల మీద ఆధారపడి లేము అని చెప్పి చెక్ తన చేతిలో పెట్టేస్తుంది. కావ్య పుట్టింటి వాళ్ళు అందరూ కలిసి కావ్యాన్ని ఇక్కడికి రాకుండా చేస్తే దాని కాపురం నిలబడుతుంది అనుకుంటారు. రాహుల్, రాజ్ లో ఉన్న బలహీతను నా కనుకూలంగా చేసుకున్నాను మామ్ అని రుద్రానికి చెప్తాడు. కావ్య పుట్టింటికి వెళ్ళి నాన్న ఇంకా రావట్లేదు ఏంటి మీరు నేను మీకోసం ఎదురు చూస్తున్నాను అంటది. కృష్ణమూర్తి.. ఈ పని ఆపేసి మీ అత్తయ్య ఇంటికి వెళ్ళిపో అని చెప్తాడు. కనకం జరిగిన విషయం మొత్తం చెప్తుంది.
కావ్య ఈ టైంలో మిమ్మల్ని వదిలేసి నేను ఎలా వెళ్తాను నాన్న అంటుంది. కృష్ణమూర్తి ఇల్లు అమ్మేసుకుని చెట్టు కింద ఉంటాము కూతురు కాపురం కూల్చి మా ఇల్లు నిలబెట్టుకోలేం అంటాడు. ఇంట్లోకి కాంట్రాక్టర్ శ్రీను వచ్చి ఈ కాంట్రాక్ట్ మీకు దూరమైంది ఇక పని చేయ అవసరం లేదు అని చెప్తాడు. ఎందుకు అని కావ్య గట్టిగా నిలదీస్తే మీ ఆయనే క్యాన్సిల్ చేసుకోమని చెప్పాడు. అప్పు.. కళ్యాణ్ దగ్గరకు వచ్చి రాతిరంతా చావ దొబ్బుతావ్ ఎందుకురా అంటుంది. ఎన్ని నెంబర్లు కి ట్రై చేసావని కళ్యాణ్ ని అడిగితే అన్ని నెంబర్లకి ట్రై చేశాను ఎక్కడ లాజిక్ మిస్ అవుతుంది అంటాడు కళ్యాణ్. ఇంతలోగా అనామిక అప్పుకి ఫోన్ చేసి హలో బ్రో అంటుంది నీకు కూడా బ్రో అయ్యేనా అంటే ఏదో ఫ్రెండ్లీగా పిలిచాను అని అనామిక అంటుంది.
దుగ్గిరాల వంశం మొత్తం చాలా ఆగ్రహంగా ఉంటారు. కావ్య తన అత్తింటికి వెళ్తే అపర్ణ నిన్న అందరూ తప్పు జరిగిందంటే నువ్వు సరిదిద్దుకుంటానన్నావ్ ఇదేనా సరిదిద్దుకోవడం అంటే అంటుంది. కావ్య మీద అపర్ణన ఎదురు తిరుగుతుంటే కావ్య అందుకేనా మీరు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి బెదిరించారు అని అంటుంది. నువ్వు నాలుగు గోళ్ళ మధ్య మాట్లాడితేనే నీకు అవమానంగా అనిపిస్తే నువ్వు మళ్ళీ పబ్లిక్ లో మాట్లాడావు అని అపర్ణ, కావ్యను అంటుంది. అపర్ణ నువ్వు ఇంటికి కోడలుగా ఉండాలంటే నువ్వు ఇక్కడ ఉన్న అందరికీ నచ్చేటట్టు ఉండాల్సిందె అంటుంది. తప్పు చేసింది మీరు నేను నా నిర్ణయాన్ని మార్చుకోను అని కావ్య అంటుంది. మా మాట మీద లెక్క లేనప్పుడు ఇక నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని అపర్ణ అంటుంది. ఇకపై నీకు ఈ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు అని అపర్ణ అంటుంది ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది.