జైల‌ర్ సినిమాకు ఫ‌స్ట్ అనుకున్న హీరో బాల‌కృష్ణా.. డైరెక్ట‌ర్ నెల్స‌న్ కామెంట్‌..!

సౌత్‌ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్స‌న్‌ దిలీప్ కూమ‌ర్‌ డైరెక్షన్లో రూపొందిన మూవీ జైల‌ర్‌. ఈ సినిమా ఇటీవల బుధవారం (ఆగస్టు 10) ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీలో రజనీకాంత్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఈ మూవీ ప్రేక్షకుల్లో బాగా కనెక్ట్ అయింది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సంపాదించిన ఈ సినిమా సక్సెస్ మీట్ ఇటీవల సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఈవెంట్ లో భాగంగా నెల్సన్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వివరించాడు.

ఈ సినిమాలో కథను రాసేటప్పుడు కీరోల్‌ కోసం నందమూరి నట‌సింహ బాలకృష్ణను తీసుకోవాలని అనుకున్నామని.. కానీ అది కుదరలేదని చెప్పుకొచ్చాడు. తెరపై రజనీకాంత్ సార్ ఒకరు కనిపిస్తేనే ఈ సినిమాలో జోష్ ఉంటుందనిపించింది అందుకే మల్టీస్టారర్‌గా తీయాలని ఆలోచనను మానుకున్నానని ప్రత్యేక ఆకర్షణ కోసం మోహన్ లాల్, శివరాజ్ కుమార్లను సెలెక్ట్ చేశానని చెప్పుకొచ్చాడు. వీళ్ళు సినిమాలో నటించడం వల్ల జైలర్ మల్టీ స్టార్ అని న్యూస్‌ వచ్చాయని ఇక ఇందులో పోలీస్ పాత్ర కోసం తెలుగు హీరో బాలయ్యను తీసుకోవాలనుకున్నానని చెప్పాడు.

ఆ క్యారెక్టర్ నీ బాలకృష్ణకు అనుగుణంగా డిజైన్ చేయలేకపోయానని.. అందుకే ఆయనను అప్రోచ్ కూడా కాలేదు ఆయన్ను కలిసి ఉంటే ఎస్ అనేవారు లేదో తర్వాత సంగతి అంటూ చెప్పుకొచ్చాడు. ఫ్యూచర్లో బాలకృష్ణతో సినిమా చేస్తానేమో అంటూ ఆయన మాట్లాడారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో జైలర్ సినిమాలో బాలకృష్ణ కూడా నటించి ఉంటే సినిమా ఓ రేంజ్ లో ఉండేది అంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.