కొంచెం కష్టమైన మానుకోవాల్సిన అలవాట్లు, అలవాటు చేసుకోవాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఈ అలవాట్లను వల్ల ఇటువంటి ఇబ్బంది ఉండదని కొందరు అనుకుంటారు. కానీ ఈ అలవాట్లు మానుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలవాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. అలవాటు చేసుకోవాల్సిన పని ఎక్సర్సైజ్, దీనివల్ల బాడీకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కానీ దీనిని మాత్రం మనం చెయ్యం. కూర్చున్న చోటికి అన్ని రావడం వల్ల మనం ఎక్సర్సైజ్ లాంటి పదాలని మర్చిపోయాం.
ఎక్సెస్ చేయడం వల్ల ఫిజికల్ గా, మెంటల్ గా అనేక లాభాలు ఉంటాయి. మానుకోవాల్సిన అలవాట్లు. ఫోన్ అనునిత్యం చేతిలోనే ఉంటుంది. ఫోన్ చూడడం విపరీతంగా అలవాటుగా మారిపోయింది. ఐదు నిమిషాలు కూడా ఫోన్ లో కళ్ళు పెట్టకుండా ఉండలేరు. ఫోన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలానే ఉన్నాయి. కానీ మనం అవేమీ పట్టించుకోకుండా ఏం కాదులే అని నెగ్లెట్ చేస్తూ ఉంటాము. అతిగా పని చేస్తూనో, ఆలోచిస్తూ, ఎంటర్టైన్మెంట్ ఇలా అనేక పనులతో అర్ధరేత్రులు వరకు మేలుకోవడం, తెల్లవారుజామున పడుకోవడం ఆ తర్వాత ఏ పది, ఒంటిగంట లేదా రోజంతా పడుకోవడం ఇవన్నీ పూర్ స్లీపింగ్ హ్యాబిట్స్. ఈ విషయంలో ప్రకృతికి అనుకూలంగా ఉండడం చాలా మంచిది.
శరీరానికి పడని ఫుడ్ తినకపోవడం చాలా ఉత్తమం. బయటికి వెళ్ళినప్పుడు వేరే ఫుడ్ దొరకలేదను ఇలా అనేక కారణాలతో జంక్ ఫుడ్ ను తినేస్తారు. సాయంత్రం అయితే స్ట్రీట్ ఫుడ్ ను తినడమే పనిగా పెట్టుకునే వారు మరికొందరు. ఇప్పుడు ఎటువంటి సమస్యలు రాకపోయినా ఫ్యూచర్ లో మాత్రం అవి దెబ్బతీస్తాయి. ఇతరులతో కలవడానికి చాలామంది ఆసక్తి చూపించారు. జాబ్ లేదను, పెళ్లి కాలేదని ఇలా అనేక ఇలా అనేక సమస్యలతో జనాల్లో కలవడం మాట్లాడడం చేయరు. ఇది కూడా ఒక చెడ్డ అలవాటే. అందరూ ఏమనుకుంటారో అని ఆలోచించే కంటే అందరితో కలిసి మెలిసి మాట్లాడితే తనకు కొత్త అవకాశాలు రావచ్చు.